EPAPER
Kirrak Couples Episode 1

Lokesh : నేడు నెల్లూరు జిల్లాలోకి లోకేశ్ ఎంట్రీ.. రాయలసీమలో ఎన్ని కిలోమీటర్లు నడిచారంటే..?

Lokesh : నేడు నెల్లూరు జిల్లాలోకి లోకేశ్ ఎంట్రీ.. రాయలసీమలో ఎన్ని కిలోమీటర్లు నడిచారంటే..?


Nara Lokesh padayatra live today(AP latest news): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర మంగళవారం సాయంత్రం నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఆత్మకూరు నియోజకవర్గంలో మొదలయ్యే ఈ పాదయాత్ర నెల రోజులపాటు ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. రోజూ సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు స్థానిక నాయకుల పరిచయం, స్థానిక సమస్యలపై చర్చ ఉంటుంది. ఆత్మకూరు నియోజకవర్గంలో పాదయాత్ర వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సారథ్యంలో సాగుతుంది.

సాయంత్రం 4 గంటలకు జిల్లా సరిహద్దదలోని మర్రిపాడు మండలం వద్ద కదిరినాయుడుపల్లిలో నారా లోకేశ్ ప్రవేశిస్తారు. నియోజకవర్గ బాధ్యులు ఆనం, జిల్లా నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేశారు. తొలిరోజు 7 కిలోమీటర్లు నడిచి పడమటి నాయుడుపల్లికి చేరుకుంటారు. అక్కడే రాత్రి బస చేస్తారు.


నారా లోకేశ్ పాదయాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లా, కందుకూరు నియోజకవర్గాల్లో సాగేలా రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశారు. ఆత్మకూరు నుంచి మొదలయ్యే పాదయాత్ర వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు, సర్వేపల్లి, నెల్లూరు రూరల్‌, నెల్లూరు సిటీ, కోవూరు, కావలి, ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాల మీదుగా ప్రకాశం జిల్లాలోకి ప్రవేశిస్తుంది.

లోకేశ్ యువగళం పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను నెల్లూరు-కడప జిల్లా సరిహద్దు ప్రాంతంలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ రామ్‌గోపాల్‌రెడ్డి, బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌ రెడ్డి, టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు బుల్లెట్‌ రమణ పరిశీలించారు.

రాయలసీమలో 124 రోజులపాటు లోకేశ్ పాదయాత్ర సాగింది. నాలుగు జిల్లాల్లో 44 నియోజకవర్గాల్లో 1587 కిలోమీటర్లు నడిచారు.

Related News

Subramanian Swamy: తిరుమల లడ్డూ వివాదం.. స్వామిని దించిన జగన్, సుప్రీంలో పిటిషన్

Target Dwarampudi: ద్వారంపూడి చిక్కినట్టేనా? కాకినాడలో షాపుల కూల్చివేత

Tirumala: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. లడ్డూ ప్రసాదాలపై అనుమానాలు వద్దు.. కల్తీ నెయ్యిపై టీటీడీ క్లారిటీ

TTD Conduct On Hhomam: తిరుమలలో హోమం, నాలుగు గంటలపాటు..

Maredumilli Tour: విషాదాన్ని నింపిన మారేడుమిల్లి టూర్.. జలపాతంలో గల్లంతై మెడికోలు మృతి

SIT on Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, సిట్ ఏర్పాటు, వైసీపీ నేతలు ఇరుకున్నట్టే..

Balineni: ఒంగోలులో ఫ్లెక్సీ వార్‌పై స్పందించిన బాలినేని.. జనసేనలోకి వెళ్లడం క్యాన్సిలా?

Big Stories

×