EPAPER
Kirrak Couples Episode 1

Congress: కాంగ్రెస్ ‘బలగం’.. ‘అన్నీ మంచి శకునములే’..

Congress: కాంగ్రెస్ ‘బలగం’.. ‘అన్నీ మంచి శకునములే’..
karnataka cm

Congress News Latest(Telugu news live today): కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. కంఠీరవ స్టేడియంలో అట్టహాసంగా ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ వేదిక.. భవిష్యత్ రాజకీయాలకు ప్లాట్‌ఫామ్‌గా నిలిచింది. జరిగింది కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమమే. కానీ, దేశంలోని బీజేపీయేతర పార్టీల నాయకులను ఒక్కచోటకి చేర్చింది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలుపార్టీల అధినేతలు విచ్చేసి.. భవిష్యత్ కాంగ్రెస్ కూటమిపై ఓ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ బలగమంతా తరలివచ్చి బలప్రదర్శన చేశారు.


కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్‌విందర్ సింగ్‌లు హాజరయ్యారు. కాంగ్రెసేతర సీఎంలు అయిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. బెంగళూరుకు తరలివచ్చారు. ఇప్పటికే తమిళనాడులో కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తోంది డీఎంకే. సీఎం స్టాలిన్ మొదటినుంచీ కాంగ్రెస్‌కు ప్రధాన మద్దతుదారుగా ఉన్నారు. ఇక, బీహార్ సీఎం నితీష్ కుమార్ సైతం దేశంలో బీజేపీయేతర ప్రభుత్వం కోసం తనవంతుగా గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. వరుసపెట్టి రాష్ట్రాల పర్యటనలు చేస్తూ.. ప్రతిపక్షాలను ఏకం చేస్తున్నారు. ఆయన సైతం కాంగ్రెస్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధమనే మెసేజ్ ఇచ్చారు. ఇక, బెంగాల్ దీదీ మమతా ముఖర్జీకి ఆహ్వానం లేకపోవడంతో ఆమె రాలేదు. కానీ, కాంగ్రెస్ నేతృత్వంలో మరో కూటమి ప్రస్తావనను ఆమె పదే పదే తీసుకొస్తున్నారు. కాంగ్రెస్ లేకుండా కేంద్రంలో అధికారంలోకి రావడం ఏ ప్రాంతీయ పార్టీకి సాధ్యం కాదని మమత తేల్చి చెబుతున్నారు. ఇక, తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్‌లకు ఇన్విటేషన్ లేదని అంటున్నారు.

ముఖ్యమంత్రులే కాదు.. కర్నాటక సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం పలు పార్టీల అగ్ర నేతల బలప్రదర్శనకు వేదికగా నిలిచింది. రాహుల్, ప్రియాంకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వారితో కలిసిపోయారు. ఇక, ఎన్సీపీ నుంచి సీనియర్ మోస్ట్ పవర్‌ఫుల్ లీడర్ శరద్ పవార్ హాజరయ్యారు. కశ్మీర్‌కు చెందిన మరో సీనియర్ నేత ఫరూక్ అబ్దుల్లా, మహబూబా ముఫ్తీలు సైతం విచ్చేశారు. కమ్యూనిస్టుల తరఫున సీతారాం ఏచూరీ, డీ.రాజాలు తరలివచ్చారు. పాండిచేరి నుంచి రంగస్వామి, నటుడు కమల్ హాసన్ సైతం వేదికపై కనిపించారు. యూపీ నుంచి అఖిలేష్ యాదవ్ వస్తారని ప్రచారం జరిగినా చివరి నిమిషంలో ఆయన రాలేకపోయారని చెబుతున్నారు. ఇలా.. ఒకే వేదికపై బీజేపీయేతర పార్టీల నేతలంతా బలప్రదర్శన చేపట్టి.. భవిష్యత్ రాజకీయ భారతాన్ని ఆవిష్కరించారని అంటున్నారు. ఇది మా ‘బలగం’.. ఢిల్లీపై దండయాత్రకు సిద్ధం..అంటూ కాంగ్రెస్ పార్టీ కర్నాటక వేదికగా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది.


ఈ పరిణామాన్ని తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఇది అత్యంత కీలక కలయిక. వచ్చే ఆరు నెలల్లో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ తర్వాత సార్వత్రిక ఎలక్షన్లు కూడా ఉన్నాయి. ఇలాంటి కీలక సమయంలో ప్రతిపక్షాల మధ్య ఈ విధమైన ఐక్యత.. బీజేపీకి బెదురు పుట్టించేదే అంటున్నారు. తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మేఘాలయలో ఎన్నికలు ఉన్నాయి. కర్నాటక గెలుపు జోరుతో.. ఆయా రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరేయాలని గట్టిగా డిసైడ్ అయింది. వీటిలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. విజయాన్ని మళ్లీ రిపీట్ చేస్తామనే ధీమాతో ఉంది ఆ పార్టీ. ఇక, కాస్త ట్రై చేస్తే మధ్యప్రదేశ్ సైతం కాంగ్రెస్ ఖాతాలో ఈజీగా పడిపోతుంది. దొడ్డి దారిన కాంగ్రెస్‌ నుంచి మధ్యప్రదేశ్‌ను లాగేసుకున్న కమలదళానికి ఈసారి మరింత గట్టిగా బుద్ధి చెప్పాలని చూస్తోంది. ఇక మిగిలిన పెద్ద రాష్ట్రం తెలంగాణనే.

కర్నాటక తర్వాత తెలంగాణనే టార్గెట్‌గా పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ వ్యాప్తంగా హస్తం పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉండటం, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ ఉండటం, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రూపంలో బలమైన నాయకత్వం ఉండటం.. అదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో.. ఈసారి తెలంగాణ గెలుపు పక్కా అంటోంది కాంగ్రెస్. కర్నాటకలో పార్టీని విజయతీరాలకు చేర్చిన ప్రియాంక, వేణుగోపాల్‌లు ఇప్పుడు తెలంగాణనే టార్గెట్ చేసుకున్నారని తెలుస్తోంది. కర్నాటకలో అమలు చేసిన వ్యూహాలనే.. ఇక్కడా ఇంప్లిమెంట్ చేయనుంది. స్పష్టమైన హామీలు, పదునైన వ్యూహాలతో.. గులాబీ బాస్‌కు దిమ్మతిరిగే షాక్ ఇవ్వాలనే పట్టుదలతో ఉంది. కర్నాటకలో ఖతర్నాక్‌గా పని చేసిన కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు.. ఇక ఫుల్ టైమ్ తెలంగాణ మీదే ఫోకస్ పెట్టనున్నారు.

మొన్నటి వరకు వరుస ఓటములతో కాంగ్రెస్ డీలా పడింది. కానీ ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లో, ఇప్పుడు కర్ణాటకలో గెలుపుతో హస్తానికి కొత్త ఉత్సాహం వచ్చింది. మోదీ పాలన వైఫల్యాలను గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లగలితే.. విజయం సాధించవచ్చనే నమ్మకం కలిగింది. విపక్షాలను కలుపుకుని వచ్చే ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని చూస్తోంది. మొన్నటి వరకు కాంగ్రెస్ నాయకత్వాన్ని వివిధ విపక్షాల పార్టీ లీడర్లు వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. కర్ణాటక విజయంతో కాంగ్రెస్‌కు ప్రాధాన్యత పెరిగింది. అందుకే విపక్ష నేతలు కూడా కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారు.

ఈ యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే 4 పెద్ద రాష్ట్రాల్లో గెలిచేసి.. అదే జోరుతో సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలనేది కాంగ్రెస్ ప్లాన్. నితీష్, స్టాలిన్, మమత, పవార్, తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్, కామ్రేడ్లు.. ఇలా అంతా కలిసొచ్చే అవకాశం ఉందని కర్నాటక సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంతో తేలిపోవడంతో.. కాంగ్రెస్‌లో మరింత జోష్ పెరిగింది. ఈ బలగంతో.. బలమైన కాషాయ దళాన్ని ఎన్నికల రణరంగంలో చిత్తు చేయాలని భావిస్తోంది. చూస్తుంటే.. కాంగ్రెస్‌కు అన్నీ మంచి శకునములే.. అనిపిస్తోంది.

Related News

Janasena Party: బాలినేని అండతో జనసేనలోకి మరో వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

Sahithi Infrastructure Fraud: ల‌క్ష్మీనారాయణ లీల‌లు.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

Real Estate Fraud: బూదాటి పాపం పండింది..! లెక్కలతో సహా ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్

Venkat Reddy: ఆ ప్యాలెస్ లోపెద్ద తిమింగలమే ఉంది

YS Jagan: జగన్‌ను లైట్ తీసుకున్న.. కొడాలి నానీ, వంశీ

Black Units Into Action: రంగంలోకి బ్లాక్ యూనిట్.. వణికిపోతున్న ఇజ్రాయెల్

Israel vs Hezbollah War: హిజ్బుల్లా డేంజరస్ ఆపరేషన్‌ ఇజ్రాయెల్ ప్లాన్ ఏంటి?

Big Stories

×