EPAPER
Kirrak Couples Episode 1

Adivasi village : ఆదివాసీ గ్రామం లో ఒక రోజు…..

Adivasi village : ఆదివాసీ గ్రామం లో ఒక రోజు…..
Adivasi village

Adivasi village : ఏప్రిల్ చివరి వారం ఎండలు 44డిగ్రీల టెంపరేచర్ తో ఉన్న సమయం….హైదరాబాద్ నుండి తెల్లవారుజామున1గంటలకు ఆఫీస్ నుండి బయలుదేరిన నా టీమ్ 1.40కి నన్ను మా ఇంటి వద్ద పిక్ అప్ చేసుకున్నారు దాదాపు 7 గంటల నిర్వీరామప్రయాణం తర్వాత ఉదయం 9గంటలకు పెంచికల్ పాడు చేరుకొని అక్కడ టిఫిన్ చేసి మోర్లి గుడ బయలుదేరాం మా స్టోరీ లో భాగంగా ఉదయం నుండి ఎర్రటి ఎండల్లో టీమ్ అంతా చుట్టుపక్కల గ్రామాలు తిరిగి స్టోరీ పూర్తి చేసాము మధ్యాన్నం మాకు ఆ అడవిలో భోజనం దొరకలేదు దీంతో చిన్న దుకాణం లో పల్లి పట్టి బిస్కెట్ లు కొనుక్కొని వాటితో కడుపునింపుకొని సాయంత్రం 6కి స్టోరీ లో 80%పూర్తి చేసాం కొంత షూట్ మిగిలిపోయి ఉండడం టీమ్ మొత్తం అలసిపోయి ఉండడం….పెంచికల్ పాడు కు వెళ్లే దారి కూడా బాలేక పోవడం తో జర్నీ సేఫ్ కాదనుకొని… సెల్ సిగ్నల్ నీటి సదుపాయాలు లేని ఆ ఆదివాసీ గ్రామం లోరాత్రి బస చేయాలనుకున్నాం …. సాయంత్రం కాగానే సిగ్నల్ కొంచెం వస్తుంది అనుకున్న పక్క గ్రామంలోని గుట్ట పైకి పోయాం 1పాయింట్ సిగ్నల్ వచ్చిరానట్టు గా రావడం తో ఇంటికి ఫోన్స్ చేసుకున్నాం ఏ గ్రామం లో ఉన్నామో చెప్పి గుట్ట కిందికి వచ్చి ఆ గ్రామం లో మాకు ఆశ్రయం ఇచ్చిన లచ్చక్క గారి ఇంటికి వచ్చాము తినండి కొడుకా మధ్యాహ్నం ఎంతిన్నరో లేదో అంటూ తమకు ఉన్నంత లో కట్టెల పొయ్యి పై అప్పటికప్పుడు అన్నం ఆలుగడ్డ కూర గుడ్డు ఉడికించి పెట్టింది….. ఆ ఊర్లో ఎవరో దేవర పండుగ చేసారు రాత్రి మొత్తమ్ డీజే సాండ్..


మా టీమ్ లోని పిల్లలకి ఇంటి బైట మంచాలు వేశారు… నేను ఇంటి లోపల పడుకున్నాను కానీ డీజే సౌండ్.. దానికి తోడు కొత్త ప్లేస్ కావడం తో నిద్ర పట్టలేదు….10.30సమయం లో వాకిట్లో నుండి తేలు అని అరుపు వినిపించడం తో మా టీమ్ బైట ఉండడం తో బైటికి వచ్చి చూసా పెద్ద నల్ల తేలు… లచ్చక్క కొడుకు దాన్ని చంపేశారు.. అప్పటికి వాతావరణం వర్షం వచ్చే టట్టుగా ఉండడం తో కరెంట్ పోయింది.. బైట చైర్ లో కూర్చొని కాసేపు లచ్చక్క తో ముచ్చట పెట్టాను అరగంట అయ్యాక కరెంట్ వచ్చింది…. కానీ మళ్ళీ డీజే సౌండ్ దాంతో పాపం మా టీమ్ కి నిద్రే లేదు పాపం పొద్దుకులు అలిసిపోయిన పిల్లలు నిద్ర లేక కొంచెం ఇబ్బంది పడ్డారు..కొద్దిసేపు గడిచిందో లేదో ఉరుములు మెరుపులు …. కరెంటు మల్లిపోయింది… మేఘాల అంచుల్లో మెరుపు వెలుగు తప్పా మరో వెలుగన్నది లేదు..పెద్ద పెద్ద చినుకులు గాలి దుమరం తో వర్షం……మా టీమ్,లచ్చుబాయి అందరు ఇంట్లోకి వచ్చేక్రమం లో సెల్ ఫోన్ టార్చ్ లైట్స్ వేసాము ఆ వెలుగులో మళ్ళీ ఒక పెద్ద తేలుకనిపించింది ఈ సారి నేనే తేలుని చూసి అరిచాను చాలా పెద్ద తేలు వేగం గా ఉంది దాని ప్రయాణం …లచ్చుబాయి గారు దాన్ని చంపేశారు….. ఈలోపు పిల్లలు బైట ఉన్న నాలుగు నులక మంచాలు లోపల వేశారు ఇల్లు దాదాపు ఇరుకయ్ పోయింది బైట వర్షం లోపల భయం…. మేము ఒక్కరోజు అడవిలో ఎలా ఉండాలో రోజు ఎలా గడిచి తెల్లారి హైదరాబాద్ వెళ్ళిపోతామో అనే ఆలోచించాము…

మరి నిత్యం ఇలాంటి అనేక రకాల పరిస్థితులతో సావాసం చేస్తూ వీళ్ళు ఎలా ఉంటున్నారో అని అనిపించింది…..ఇది రాసే ఇప్పటిసమయం 12.30 సూర్యుడికోసం నా ఎదురు చూపులు…నిద్రని కరువు చేసాయి……దట్టమైన దండకారణ్యం లో ఉరుములు మెరుపుల మధ్య కారుచీకటి లో సెల్ సిగ్నల్ లకు కరెంటు కు దూరం గా ఇరుకుఇల్లు ఉన్నా విశాలమైన మనసు గళ లచ్చుబాయ్ గారి ఇంట్లో ఉండడం వళ్ళ ఆదివాసీల సమస్య లు కళ్లకు కట్టినట్టుగా చుసిన అనుభవం వచ్చింది……. ఇంట్లో కీచురాళ్ళ శబ్దం బైట ఉరుముల గర్జనలతో ఆకాశం హోరుగాలివానల శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది……..2గంటలు కావస్తున్న వానతగ్గలేదు ఒక పక్క ఉక్కపోత ఇంటికి ఉన్న రెండు తలుపుల్లో ఒకటి తెరుస్తాను గాలి వస్తుంది అని లచ్చుబాయ్ గారు అన్నా రెండుసార్లు తేలు చూసాక తలుపులు తెరిస్తే ఇంట్లోకి పాములు జోరబడ్డ జోరబడుతయేమో అనే భయం తో నేనే తలుపులు పెట్టమన్నాను…. ఆలోచనలు పాములు తేల్లు జెర్రులు వీటి చుట్టే మంచం మీద ఉన్నా కాలు కింద పెట్టాలంటే భయం…. ఆలా ఆలోచిస్తుండగానే నిద్ర పట్టేసింది …పశువులు..కోడి పుంజుల అరుపులు రేకలువారినసందేశం తో మెలుకువ వచ్చింది… ఎంతో ఎదురు చుసిన ఉదయం… చాలా బాగా అనిపించింది….
మొత్తనికి ఆదివాసీల ఊర్లో ఆలా మా రోజు గడిచింది…..లేవగానే మొదట చేసిన పని సెల్ ఫోన్ సిగ్నల్ కొంచెం వచ్చే కమ్మర్ గాం గుట్టల దగ్గరికి వచ్చి ఇంటికి ఫోన్ చేయడం…. అడవి చూడడానికి చాలా బాగుంటుంది కానీ అడవిలో ఉండడం చాలా కఠినం… అది అడవిబిడ్డలైన ఆదివాసీలకే సాధ్యం………అటువంటి అడవిబిడ్డల సమస్యలు సమాజానికి చూపెందుకు కారడవులను … కఠినపు దారులను .. వాగులు వంకలను దాటుకుంటూ జనం కోసం జనతా గ్యారేజ్ టీమ్ చేసిన ప్రయత్నం @ఈ వారం అడవి కాచిన బిడ్డలు


Tags

Related News

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

Big Stories

×