EPAPER
Kirrak Couples Episode 1

Viveka Murder Case: అవినాశ్‌రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు!.. ఉదయ్ రిమాండ్ రిపోర్టులోనూ పేరు.. సీబీఐ వదిలేదేలే!!

Viveka Murder Case: అవినాశ్‌రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు!.. ఉదయ్ రిమాండ్ రిపోర్టులోనూ పేరు.. సీబీఐ వదిలేదేలే!!
avinash reddy cbi

Viveka Murder Case (AP News Updates): వివేకా హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఇటీవల సీబీఐ అరెస్టు చేసిన ఉదయ్ కుమార్ రెడ్డి కస్టడీ పిటిషన్ లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. వివేక హత్య గురించి ఉదయ్ కుమార్ రెడ్డికి ముందే తెలుసని సీబీఐ తెలిపింది. ఉదయ్ కుమార్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి,శివ శంకర్ రెడ్డి కలిసి ఆధారాలు తారుమారు చేశారని రిపోర్టులో సీబీఐ వెల్లడించడం కలకలం రేపుతోంది.


హత్య తర్వాత ఉదయ్ కుమార్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళాడని.. గూగుల్ టేకౌట్‌లో తేలిందని సీబీఐ చెబుతోంది. వివేకా గుండెపోటుతో చనిపోయినట్టు చిత్రీకరించేందుకు.. ఆధారాలు చెరిపేసేందుకు ప్రయత్నించారు. వివేకా డెడ్‌బాడీని బాత్రూం నుండి బెడ్‌రూంకి ఉదయ్ కుమారే తీసుకొచ్చాడని తేల్చింది. తన తండ్రి ప్రకాష్‌రెడ్డితో మృతదేహానికి కుట్లు వేయించాడని.. వివేక తలకు ఉన్న గాయాలు కనపడకుండా బ్యాండేజ్‌లు వేసారని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది సీబీఐ. ఉదయ్ కుమార్ రెడ్డి పారిపోతాడనే అనుమానంతో అరెస్ట్ చేశామని స్పష్టం చేసింది.

“హత్య జరిగిన రోజు ఉదయం 4 గంటలకు ఉదయ్‌ తన ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. ఆ రోజంతా ఎంపీ అవినాష్‌ ఇంట్లోనే ఉదయ్‌, శివశంకర్‌రెడ్డి ఉన్నారు. హత్య జరిగిన స్థలంలో అవినాష్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌ రెడ్డి, గంగిరెడ్డి, శివశంకర్‌ రెడ్డితో కలిసి ఉదయ్‌ ఆధారాలు చెరిపి వేశారని అనేందుకు సాక్ష్యాలున్నాయి” అంటూ సీబీఐ రిమాండ్ రిపోర్టులో తెలిపింది.


Related News

AP Liquor: మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. తక్కువ ధరకే లిక్కర్!

Appsc new chairman: ఏపీపీఎస్సీ న్యూ ఛైర్మన్, వారికే ఛాన్స్

Tirumala laddu row: లడ్డూ వివాదం.. టెన్షన్‌లో వైసీపీ, సీబీఐ లేదా జ్యుడీషియల్? కెమికల్ ఇంజనీర్ల నిపుణలేమంటున్నారు?

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

JANASENA vs TDP: ఆ ఎన్నికతో పిఠాపురంలో సీన్ రివర్స్ అయిందా.. జనసేన వర్సెస్ టీడీపీ.. ఏం జరుగుతోంది?

AP Elections: ఏపీలో ఎన్నికలు.. అప్పుడే అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ..

TTD Ex Chairman: చంద్రబాబుపై శివాలెత్తిన భూమన.. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఫైర్

Big Stories

×