EPAPER

Hanuman Junction:- హనుమాన్ జంక్షన్ లో ఆగితే ఒక దండం పెడితే చాలా….

Hanuman Junction:- హనుమాన్ జంక్షన్ లో ఆగితే ఒక దండం పెడితే చాలా….

Hanuman Junction:- పదహారో నెంబరు జాతీయ రహదారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు హనుమాన్ జంక్షన్ రాగానే, అందరం వెతుక్కునేది ఆంజనేయ స్వామి విగ్రహమే. బస్సులో వెళ్తున్నా, కారులో వెళ్తున్నా అక్కడకి వచ్చేటప్పటికి ఆటోమేటిక్ గా దృష్టి హనుమాన్ విగ్రహం వెైపు వెళ్లి మనసు నమస్కారం చేస్తుంది. హనుమాన్ జంక్షన్ కే ఒక ఐకాన్ ఈ, ఆంజనేయ స్వామి విగ్రహం. అంత పేరు ఉంది ఈ విగ్రహానికి. కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దులో ఉంది ఈ విగ్రహం. స్వామి పాదాలు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల సరిహద్దుగా ఉన్నాయి.


గర్భగుడి పశ్చిమగోదావరి జిల్లాలో, మెట్లు కృష్ణా జిల్లాలో ఉన్నాయి. ఆంజనేయ స్వామి విగ్రహం ముఖంలో వానర లక్షణాలకంటే మానవ ముఖం లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే, నాలుగు ప్రధానమైన రోడ్డుల కూడలి కనుక, దీన్ని జంక్షన్ అని కూడా అంటారు. ఏలూరు రోడ్,గుడివాడ రోడ్, నూజివీడు రోడ్, విజయవాడ రోడ్, ఈ నాలుగు రోడ్డులు ఇక్కడే కలుస్తాయి. స్వామి వారి విగ్రహాన్ని 1938 సంవత్సరంలో ప్రతిష్టించారు.

పూర్వం ఈ ప్రాంతాన్ని నూజివీడు జమిందారు ఎం.ఆర్ అప్పారావు పరిపాలించేవారు. ఆయన తండ్రి, శ్రీ మేకా వెంకటాద్రి బహద్దూర్ 1938వ సంవత్సరం లో, ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు .ఆయన జమిందార్ గా ఉన్న సమయంలో హనుమాన్ జంక్షన్ ప్రాంతానికి వచ్చారు అప్పుడు ఆయనకు విపరీతమైన ఆకలి వేయడంతో ఆహారం కోసం వెతికారు. కనుచూపుమేర ఎటుచూసినా బీడు భూములు, ముళ్ళు పొదలతో నిండి అంతా నిర్మానుష్యంగా ఉంది. జమిందార్ కి ఆకలి బాధ ఎక్కువైన సమయంలో అద్భుతం జరిగింది. హటాత్తుగా అక్కడకు ఒక కోతి వచ్చి జమిందార్ చేతి లో అరటిపండు పెట్టి అదృశ్యమైపోయింది. ఆకలితో ఉన్న జమిందార్ ఆ పండును భుజించగానే ఎంతో శక్తి వచ్చినట్లుయింది.


సాక్షాత్తు ఆంజనేయుడే కోతి రూపంలో వచ్చి అరటిపండు ను ఇచ్చి వెళ్ళాడని గ్రహించి, భక్తపారవశ్యం తో తన్మయత్వం చెంది శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహం అక్కడ ప్రతిష్టించాలని భావించారు. భక్తులను దుష్టగ్రహ పిడముల బారి నుండి రక్షించే నిమత్తం ఆంజనేయ స్వామి నిలువెత్తు విగ్రహాన్నితయారు చేయించి నాలుగు రోడ్ల కూడలి అయిన హనుమాన్ జంక్షన్ లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆంజనేయస్వామి గుడి ఎదురుగా రోడ్డు అవతల రామాలయాన్ని నిర్మించారు.

భోగి యోగిలా ఎప్పుడవుతాడు..

for more updates follow this link:-Bigtv

Related News

Thathastu Deities: తథాస్తు దేవతలు నిజంగా ఉన్నారా? వారు ఎవరు? ఏ సమయంలో భూమి పై తిరుగుతారు?

Karthika Masam 2024: కార్తీక మాసం విశిష్టత.. తప్పకుండా పాటించాల్సిన నియమాలు ఇవే !

Horoscope Nov 4: ఈ రోజు మేష రాశి నుంచి మీనం వరకు ఎలా ఉండబోతుందంటే..

Chandra Gochar: చంద్రుడి సంచారం.. నవంబర్ 5 నుంచి ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం

Karthika Deepotsavam Live: ‘బిగ్ టీవీ’ కార్తీక దీపోత్సవాన్ని కనులారా వీక్షించండి

Weekly Horoscope Nov 3 to 9: ఈ వారమంతా మీకు ఎలా ఉండబోతుందంటే..?

Rahu Transit Aquarius: 2025లో రాహువు సంచారం.. ఈ 3 రాశుల వారి తలరాతలు మారిపోనున్నాయ్

Big Stories

×