Yogi:- పంచభూతాలు పంచేద్రియాలకి ప్రతీ. ఆ పంచేద్రియాలను మనం జయించిన నాడు పంచ భూతములు మనకు వశం అవుతాయి. ప్రకృతి మనకు వశం అవుతుంది. అంటే మాయ మన మీద పని చేయదు. అప్పుడే భోగి యోగి అవుతాడు, యోగి జ్ఞాని అవుతాడు. ముందుగా పంచభూతములను గౌరవించడం, సముచితంగా, నిర్ధిష్టంగా, అవసరములకు తగినంతగా వాడుకోవడం తెలుసుకొని వుండాలి. ఏవరైతే ప్రకృతిని గౌరవిస్తారో వారిని ప్రకృతి కూడా కాపాడుతుంది.
మనసు పంచేద్రియముల ద్వారా సుఖమును అనుభవిస్తూ ఉంటుంది. చేయకూడని పనులన్నింటినీ మనసు చూడమని అంటూ వుంటుంది. ఆ మనసును కట్టడి చేస్తే పంచేద్రియములు దారికి వస్తాయి. ఒకవేళ పంచేద్రియములు చేయకూడని పని చేసినా, మనసు తాదాత్మ్యత చెందకుండా వుంటే, పొందకుండా వుంటే ఆ పాపం అంటదు.
నిత్య బ్రహ్మచారి, నిత్య ఉపవాసం అంటే ఇదే….భోగముల యందు అనురక్తి లేకుండా వుంటే, ఆ భోగము అనుభవించిననూ భోగ ఫలితం అంటదు…..పంచ భక్ష్య పరమాన్నములు తిన్ననూ కటిక ఉపవాసం వున్న ఫలితాన్ని లెక్క కడతారు. చూడని వస్తువును చూసిననూ చూడనట్లే. గృహస్థాశ్రమ ధర్మంలో ఈ విధముగా ఉండటమే బ్రహ్మచర్యం అంటారు. శాస్త్రం చెప్పిన నియమాలను
పాటిస్తూ, శౌచమును పాటిస్తూ భార్యతో కలిసి ఉండటమే గృహస్థులకు బ్రహ్మచర్యం.
అయితే మనసు ఒకటి జయిస్తే పరీక్ష మరో రూపంలో వస్తుంది, ఎక్కడో చోట మాయ మనల్ని పడగొడుతూ ఉంటుంది. అనుక్షణం మనల్ని మనం పరీక్ష చేసుకొంటూ, ఓక్కోక్కటి జయిస్తూ మహాత్ముల చరిత్రను ఆదర్శంగా తీసుకొంటూ ముందుకు నడవాలి…..ఈ జన్మలో కాకపోయినా మరు జన్మలోనైనా విజయం మనదే, అప్పటిదాకా ఆగకూడదు…
ఆల్మరాలో ఇవి పెడితే మీ లక్కు తిరిగినట్టే…
for more updates follow this link:-Bigtv