EPAPER

TTD:-తిరుమల భక్తులకి మరో ఆఫర్ ఇచ్చిన టీటీడీ

TTD:-తిరుమల భక్తులకి మరో ఆఫర్ ఇచ్చిన టీటీడీ

TTD:-ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలిజీని వాడుతూ శ్రీవారి భక్తులకి సేవలందిస్తున్న తిరుపతి తిరుమల దేవస్థానం మరో క్రేజీ నిర్ణయం తీసుకుంది. వసతి బుకింగ్ ను ఆన్ లైన్ లో అందించాలని నిర్ణయించింది.. శ్రీవారి భక్తుల రద్దీ పెరగడంతో తిరుమలో వసతి గృహాలకు ఏ సీజన్ లో చూసినా భారీగా డిమాండ్ ఉంటోంది. ఇప్పటికే మార్చికి సంబంధించి ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ రిలీజ్ చేసింది. నిమిషాల వ్యవధిలోనే టికెట్లు పూర్తి అయ్యాయి. ఇప్పుడు మార్చి నెలకు సంబంధించిన బుకింగ్ కోటా కూడా విడుదల చేయనుంది. అయితే ఈ ఆన్ లైన్ వసతి కోటాను టీటీడీ అధికారిక వెబ్ సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని సూచించింది.


వసతి గదుల కోసం శ్రీవారి భక్తులు https://tirupatibalaji.ap.gov.inలో రిజిస్టర్ చేసుకోవాలి. సైట్ లో సైన్ అప్ ఆప్షన్ ద్వారా వివరాలు నమోదు చేస్తే అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత లాగిన్ పేజీకి వెళ్తుంది. లాగిన్ తర్వాత డ్యాష్ బోర్డు లో మార్చికి సంబంధించి తేదీలు అందుబాటులో ఉంటాయి.

అంటే ఇప్పటికే మీరు ఏ తేదీన దర్శనం టికెట్లను బుక్ చేసుకున్నారో.. అదే రోజు వసతి గదిని కూడా బుక్ చేసుకోవాలి.. ఆయా తేదీల్లోఖాళీగా ఉన్న కాటేజ్ లు కనిపిస్తాయి. ఎంతమందికి రూం కావాలి..? ఏంటన్న వివరాలు అందులో నమోదు చేయాలి . ఖాళీగా ఉన్న రూంలు పచ్చరంగులో కనిపిస్తాయి. వెంటనే కావాల్సిన తేదీల్లో.. కావాల్సిన కాటేజ్ లను సెలెక్ట్ చేసుకోవాలి.. అక్కడ క్లిక్ చేయగానే.. పూర్తి డిటైల్స్ నింపాల్సి ఉంటుంది. తరువాత రూమ్ బుక్ అవుతుంది.


శ్రీవారి దర్శనం కోసం వచ్చే సామాన్య భక్తులకు మరింత పారదర్శకంగా, వేగంగా సేవలందించేందుకు తిరుమల లో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని అమలు చేస్తున్నామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి వెల్లడించారు. గదుల కొరకు పేర్లు నమోదు చేసుకున్న భక్తులకు త్వరితగతిన రూములు దొరుకుతున్నాయని తెలిపారు. రెండవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వెళ్ళే భక్తులకు కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానంతో రూ.50కే ఉచిత లడ్డు టోకెన్లు ఇవ్వడం జరుగుతోందని అన్నారు. ఈ పరిజ్ఞానం ద్వారా లడ్డు ప్రసాదాలలో దళారి వ్యవస్థను కట్టడి చేయవచ్చని వివరించారు.

Related News

Budh Gochar: అక్టోబర్ 10 న ఈ రాశుల వారి జీవితాలు అద్భుతంగా మారబోతున్నాయి

Lucky Zodiac Signs For Money: మేష రాశితో సహా ఈ రాశుల వారు త్వరలో గొప్ప అదృష్టవంతులు అవుతారు

Durga Puja Rashi 2024: దుర్గాపూజ సమయంలో ఈ రాశుల తల రాతలు మారబోతున్నాయి.. ఇందులో ఏ రాశులు ఉన్నాయంటే ?

Shardiya Navratri 2024 Day 4: నవ రాత్రులలో నాల్గవ రోజున కూష్మాండ దేవి పూజా విధానం వివరాలు ఇవే

Black Magic: ఫొటోలకు చేతబడి చేయొచ్చా? వామ్మో.. జాగ్రత్త, బలైపోతారు!

Laxmi Narayan Yog: 5 రోజుల తర్వాత తులా రాశిలో లక్ష్మీ నారాయణ యోగం..ఈ 3 రాశులకు బంగారు కాలం

Weekly Lucky Zodiacs: ఈ 3 రాశుల వారికి వచ్చే వారం అంతా బంగారు మయం కానుంది

×