EPAPER

Nanoplastics:తాగునీటిలో ఉండే ప్లాస్టిక్‌ను గుర్తించే లైట్..

Nanoplastics:తాగునీటిలో ఉండే ప్లాస్టిక్‌ను గుర్తించే లైట్..

Nanoplastics:ఈరోజుల్లో మనం తీసుకునే ప్రతీ పదార్థం కల్తీ అవుతోంది. చూడడానికి మామూలుగానే అనిపించినా.. ఏ పదార్థంలో ఏ ప్రమాదం ఉందో చెప్పడం కష్టంగా మారింది. తినే తిండి, తాగే నీరు చూడడానికి శుభ్రంగానే అనిపించినా.. అవి తీసుకొని అనారోగ్యం బారినపడిన వారు కూడా ఉన్నారు. అందుకే శాస్త్రవేత్తలు ఈ సమస్యలను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా తాగే నీటిలో ప్లాస్టిక్‌ను కనిపెట్టడానికి వారు ఓ కొత్త మార్గాన్ని కనుగొన్నారు.


ప్లాస్టిక్ అనేది పర్యావరణానికి మంచిది కాదని, దానిని వినియోగించడం పూర్తిగా ఆపేయాలని పర్యావరణవేత్తలు ఎంతగా చెప్పినా.. అది మానవాళి జీవితాలలో తీసివేయడం కష్టంగా మారింది. మునుపటితో పోలిస్తే ప్లాస్టిక్ వినియోగం తగ్గినట్టు అనిపించినా.. పర్యావరణానికి జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ అనేది ఆహారంలో కూడా కలుస్తోంది. ముఖ్యంగా నీటిలో కలిసిన ప్లాస్టిక్‌ను గుర్తించకుండా తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దానిని అదుపు చేయడానికే శాస్త్రవేత్తలు ఓ పరిష్కారంతో ముందుకొచ్చారు.

మనం రోజూ ఉపయోగించి పక్కన పడేసే ప్లాస్టిక్స్‌లో మైక్రో మీటర్‌కంటే చిన్నగా ఉండే వాటిని నానోప్లాస్టిక్స్ లేదా మైక్రోప్లాస్టిక్స్ అంటారు. అవి ఎక్కడ ఉన్నాయో వాటిని గుర్తించడం చాలా కష్టం. ఇప్పుడు అవి ఎక్కువగా నీటిలో కలుస్తున్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే సౌత్ కొరియాలో నానోప్లాస్టిక్స్ శాతం ఎక్కువగా ఉంది. టీ బ్యాగ్స్‌లో, తాగునీటిలో ఎక్కువగా ఇవి కనిపిస్తూ ఉంటాయి. వాటికి సైజ్ చాలా చిన్నగా ఉండడం వల్ల వాటిని కనిపెట్టడం కష్టంగా మారింది. అంతే కాకుండా వాటిని కనిపెట్టడం ఎన్నో రోజుల సమయంపడుతుంది.


తాజాగా లైట్ ద్వారా నీటిలో నానోప్లాస్టిక్స్‌ను కనిపెట్టే మార్గాన్ని కొరియా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. రామన్ స్పెక్ట్రోస్కోపీ అనే మార్గం ద్వారా నీటిలో నానోప్లాస్టిక్స్‌ను వారు గుర్తించారు. ఆ తర్వాత డైఎలక్ట్రోఫారిసీస్ ద్వారా నీటి నుండి వాటిని వేరుచేశారు. ఒకప్పుడు నానోప్లాస్టిక్స్‌ను కనిపెట్టి వేరే చేయడానికి ఎన్నోరోజులు పట్టేది. కానీ ఈ కొత్త ప్రక్రియ ద్వారా చాలా త్వరగా ఇదంతా పూర్తయ్యి నీటి నుండి నానోప్లాస్టిక్స్ వేరయిపోయాయి. ఈ పరిశోధన సక్సెస్ అవ్వడంతో కొరియా శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Color Changing:ఇంటి వాతావరణాన్ని కంట్రోల్ చేసే కలర్..

Earth Consists: భూమిలోపల మరో కొత్త లేయర్.. కనిపెట్టిన శాస్త్రవేత్తలు..

Tags

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×