EPAPER

Korean Scientists:బ్రిడ్జిల ధృడత్వాన్ని గమనిస్తూ ఉండే టెక్నాలజీ..

Korean Scientists:బ్రిడ్జిల ధృడత్వాన్ని గమనిస్తూ ఉండే టెక్నాలజీ..

Korean Scientists:దేశ డెవలప్‌మెంట్ అనేది ఎత్తైన బిల్డిండులు, విశ్వవిద్యాలయాలు, ఐటీ లాంటివి నిర్మించడంలోనే కాదు.. బ్రిడ్జిలు, డ్యామ్‌లు లాంటివాటిలో ఉంటుందని ఆర్థికవేత్తలు అంటుంటారు. కానీ వీటిలో కొన్ని నిర్మాణాలు ధృడంగా ఉండకపోవడమే ఈరోజుల్లో సమస్యగా మారింది. ఎప్పుడు ఏ బ్రిడ్జి కూలిపోతుందో అన్న భయంతో మానవాళి జీవనం సాగుతోంది. అయితే బ్రిడ్జిలు ధృఢంగా ఉండేలా పరిశోధకులు ఓ పరిష్కారం ఆలోచించారు.


కొన్ని బ్రిడ్జిలు నిర్మించి ఎన్ని ఏళ్లయినా.. వాటికి కొంచెం కూడా డ్యామేజ్ ఉండదు. కానీ కొన్ని బ్రిడ్జిలు మాత్రం తొందరగా ఉపయోగించలేని పరిస్థితికి వచ్చేస్తాయి. అసలు బ్రిడ్జిలు ఉపయోగించడానికి సౌకర్యంగా ఉన్నాయా లేదా, వాటి ధృడత్వంలో ఏమైనా సమస్య వచ్చిందా అన్నదానిపై కొరియా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. డీఎన్ఏ (డేటా, నెట్‌వర్క్, ఏఐ) టెక్నాలజీ సాయంతో బ్రిడ్జిలు ఏ మేరకు డ్యామేజ్ అయ్యాయి, అవి ధృడంగా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాలను పరిశీలించవచ్చని వారు ప్రకటించారు.

2021లో కొరియాలో ఉన్న బ్రిడ్జిలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. 30 ఏళ్ల పైబడి నిర్మించిన బ్రిడ్జిల ధృడత్వం 12.5 శాతం తగ్గిపోయిందని వారు గుర్తించారు. 2031 వరకు ఇది 39.3 శాతానికి చేరుకుంటుందని భావిస్తున్నారు. మరో పదేళ్లలో 76.1 శాతానికి బ్రిడ్జిల ధృడత్వం తగ్గిపోతుందని వారి పరిశోధనల్లో తేలింది. అందుకే ఈ బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించిన ప్రతీ చిన్న సమాచారాన్ని సేకరించి దానిపై పరిశోధనలు నిర్వహించారు. ఈ విషయంలో టెక్నాలజీ కూడా వారికి ఉపయోగపడింది.


2021 నుండి 2022 వరకు కొరియా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో ఈ విషయంపై 5 మిలియన్ల డేటా ఎలిమెంట్స్‌ను కనుగొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా సమయం గడుస్తున్నకొద్దీ బ్రిడ్జిలు ఏ విధంగా డ్యామేజ్ అవుతుంటాయి అనే విషయాన్ని డేటా మోడల్స్ సాయంతో స్టడీ చేసింది. అంతే కాకుండా బ్రిడ్జిలకు సంబంధించిన మరికొంత సమాచారాన్ని ఐఓటీ టెక్నాలజీ ద్వారా ఏఐ స్టడీ చేయగలిగింది. దీంతో పాటు కొరియాలోని వాతావరణ మార్పులను కూడా ఏఐ గమనించింది.

బ్రిడ్జిలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన పరిశోధన ద్వారా వాటి స్టడీ కోసం డీఎన్ఏ అనే టెక్నాలజీని తయారు చేశారు కొరియా శాస్త్రవేత్తలు. ఇందులో ఏఐ ముఖ్య పాత్ర పోషిస్తోంది. 2022 చివరికి వచ్చేసరికి ఈ టెక్నాలజీ ద్వారా బ్రిడ్జిల యొక్క ధృడత్వాన్ని కనుక్కోవడంలో ఏఐ 90.8 శాతం సక్సెస్ అయ్యింది. 2023లో ఈ శాతాన్ని 95కు పెంచాలని శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారు. శాస్త్రవేత్తలు చేసిన ఈ పరిశోధన ముందుకు కొనసాగితే.. ఆ దేశంలో బ్రిడ్జిలు అర్థాంతరంగా కూలిపోవడాన్ని గమనించవచ్చని అక్కడి ప్రజలు భావిస్తున్నారు.

NASA:ఇజ్రాయెల్‌కు సాయంగా నిలబడిన అమెరికా..

ISRO Missions:స్పేస్‌కు వెళ్లనున్న ఇస్రో ఫీమేల్ రోబో ‘వ్యోమిత్ర’.. ఎప్పుడంటే..?

Tags

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×