BigTV English

ISRO Missions:స్పేస్‌కు వెళ్లనున్న ఇస్రో ఫీమేల్ రోబో ‘వ్యోమిత్ర’.. ఎప్పుడంటే..?

ISRO Missions:స్పేస్‌కు వెళ్లనున్న ఇస్రో ఫీమేల్ రోబో ‘వ్యోమిత్ర’.. ఎప్పుడంటే..?

ISRO Missions:సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో, రాకెట్రీ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు సైతం తమ సత్తాను చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక వాటికి ఏ మాత్రం తీసిపోమని ఇండియా నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే స్పేస్ పరిశోధనలు, రాకెట్రీ విభాగాల్లో ఇండియా టాప్ స్థాయిలో నిలబడడానికి అర్హత సాధించింది. ఇక ఈ ఏడాది ఇండియన్ రాకెట్రీ ఇతర దేశాలకు మించి ప్రయోగాలు చేయనున్నట్టు తెలుస్తోంది.


ఇండియన్ స్పేస్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఇప్పటికే గగన్‌యాన్ పేరుతో ఓ స్పేస్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది. దాంతో పాటు ఒక హ్యూమన్ స్పేస్ ఫ్లైట్‌ను కూడా 2024లో అంతరిక్షంలోకి పంపించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే గగన్‌యాన్ ప్రోగ్రామ్‌కు సంబంధించి 2023లోనే రెండు మిషిన్లను భారత్.. అంతరిక్షంలోకి పంపనుందని యూనియన్ మంత్రి జితేంత్ర సింగ్ తాజాగా అధికారికంగా ప్రకటించారు.

ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగానే ఇస్రో.. ఈ మిషిన్లను లాంచ్ చేయాలనే ఆలోచనలు చేసింది. కానీ అదే సంవత్సరం కోవిడ్ మహమ్మారి వల్ల మిషిన్ల ప్రయాణం మొదలుకాలేదు. ఇప్పటికి ఇవి గాలిలోకి ఎగరడానికి సిద్ధమయ్యాయి. ఈ మిషిన్లను గగనతలంలోకి తీసుకెళ్లడానికి రష్యాలో కొందరు ఆస్ట్రానాట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. కోవిడ్ వల్ల వారి ట్రైనింగ్ ఆగిపోవడం కూడా మిషిన్ల లాంచ్‌కు ఆలస్యమయ్యింది.


ఈ ఏడాది ఇస్రో లాంచ్ చేయాలనుకుంటున్న రెండు మిషిన్ల గురించి పూర్తిగా సమాచారం బయటికి రాలేదు. కానీ అందులో ఒకటి మాత్రం ఫీమేల్ రోబో వ్యోమిత్ర అని తెలుస్తోంది. ఒక మిషిన్ ఆకాశంలోకి ఎగిరిన తర్వాత.. వ్యోమిత్రను స్పేస్‌కు పంపించనుంది ఇస్రో. త్వరలోనే ఈ మిషిన్లకు సంబంధించిన పూర్తి ప్రక్రియ పూర్తయినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి భూమి మీద నుండి ఆకాశంలోకి ఎగిరిన స్పేస్ మిషిన్.. తిరిగి అదే రూట్‌లో భూమిపైకి చేరుకుంటుందో లేదో తెలుసుకోవడమే గగన్‌యాన్ లక్ష్యమని తెలుస్తోంది.

వచ్చే ఏడాది ఒక భారతీయుడిని స్పేస్‌కు పంపించాలనే ఆలోచనలో కూడా ఇస్రో ఉంది. ఇది కూడా గగన్‌యాన్‌లో భాగమే అని తెలుస్తోంది. గగన్‌యాన్ అనేది ఇండియన్ స్పేస్ ట్రావెల్‌లోని ఒక మైలురాయిగా మిగిలిపోతుందని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రూ.10 వేల కోట్లతో గగన్‌యాన్‌ ప్రారంభమయ్యింది. ఇప్పటికే చంద్రయాన్ 3తో ఓ భారీ ప్రయోగానికి కూడా ఇస్రో సిద్ధమైన విషయం తెలిసిందే.

Glaucoma:అంతుచిక్కని వ్యాధుల్లో ఒకటి.. గ్లాకోమా..

NASA:ఇజ్రాయెల్‌కు సాయంగా నిలబడిన అమెరికా..

Tags

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×