EPAPER

Hyderabad : వీధి కుక్కల దాడి.. 4 ఏళ్ల బాలుడు బలి..

Hyderabad : వీధి కుక్కల దాడి.. 4 ఏళ్ల బాలుడు బలి..

Hyderabad : వీధి కుక్కలకు పసివాడు బలయ్యాడు. 3 శునకాలు ఒక్కసారిగా మీదపడి దాడి చేస్తుంటే వాటి నుంచి తప్పించుకునేందుకు విశ్వప్రయత్నం చేశాడు. అయినా సరే ఆ శునకాలు ఈ చిన్నారిని వదలలేదు. చివరకు తీవ్రంగా పోరాడి పసివాడు ప్రాణాలు విడిచాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ హృదయ విదారకర ఘటన హైదరాబాద్ లో జరిగింది.


నిజామాబాద్‌ జిల్లా ఇందల్‌వాయి గ్రామానికి చెందిన గంగాధర్‌ నాలుగేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చాడు. అంబర్ పేట ఛే నంబర్ చౌరస్తాలోని ఓ కారు సర్వీస్‌ సెంటర్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. భార్య జనప్రియ, ఆరేళ్ల కుమార్తె, కుమారుడు ప్రదీప్‌తో కలిసి బాగ్‌ అంబర్‌పేట ఎరుకుల బస్తీలో నివాసం ఉంటున్నాడు. ఆదివారం తాను పనిచేస్తున్న సర్వీస్ సెంటర్ కు పిల్లలను తీసుకుని వెళ్లాడు. కుమార్తెను పార్కింగ్‌ ప్రదేశం వద్ద ఉన్న క్యాబిన్‌లో కూర్చోబెట్టాడు. కుమారుడిని సర్వీస్‌ సెంటర్‌ లోపలికి తీసుకెళ్లాడు. ఆ చిన్నారి ఆడుకుంటున్న సమయంలో మరో వాచ్‌మన్‌తో కలిసి గంగాధర్ బయటకు వెళ్లాడు.

కాసేపు ఆడుకున్న తర్వాత బాలుడు అక్కడ నుంచి అక్క కోసం పార్కింగ్ ప్రదేశంలోని క్యాబిన్‌ వైపు వెళుతుండగా కుక్కలు వెంటపడ్డాయి. తొలుత వాటి నుంచి తప్పించుకునేందుకు అటు ఇటు తిరిగాడు. కానీ ఆ కుక్కలు బాలుడిపై ముప్పేట దాడిచేశాయి. ఓ కుక్క కాలు..మరొకటి చేయి చెరోవైపు లాగడంతో తీవ్రంగా గాయపడ్డాడు.


తమ్ముడి కేకలు విన్న అక్క తండ్రి వద్దకు వెళ్లి ఈ విషయాన్ని చెప్పింది. గంగాధర్ వచ్చి కుక్కలను తరమడంతో బాలుడిని వదిలేశాయి. తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారిని తండ్రి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు. కానీ అప్పటికే పసివాడు ప్రాణాలు కోల్పోయాడని డాక్టర్లు చెప్పారు. ఏకంగా బాలుడి శరీరంపై 32 కుక్క గాట్లు ఉన్నాయని గుర్తించారు.
ఈ చిన్నారి ప్రాణాలు కుక్కలకు బలికావడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.

బాలుడి మృతిపై అంబర్ పేట ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ కుక్కలను నియంత్రించే చర్యలు చేపట్టడంలేదని మండిపడ్డారు. దీంతో జీహెచ్ఎంసీ యంత్రాంగం కదలింది. అంబర్ పేటలో వీధి కుక్కలను పట్టుకునే చర్యలు చేపట్టింది. ఒక ప్రదీపే కాదు ఇలా ఎందరో చిన్నారుల వీధి కుక్కలకు బలవుతున్నారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుతోంది. కుక్కల నియంత్రణపై ప్రభుత్వాలు అంతగా దృష్టి పెట్టకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి.

Sayanna: ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియల్లో హైడ్రామా.. అభిమానుల ఆందోళన.. సర్కారు షేమ్ షేమ్

Raja Singh: రాజాసింగ్‌ను చంపేస్తాం.. పాకిస్తాన్ నుంచి వార్నింగ్..

Tags

Related News

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Big Stories

×