EPAPER

Water on Mars: మార్స్‌పై నీటిజాడ.. తొలిసారిగా..

Water on Mars: మార్స్‌పై నీటిజాడ.. తొలిసారిగా..
Water on Mars

Evidence of water existence found on Mars

నీరు, గాలి ఉండే మానవాళికి జీవనం సాధ్యం అని శాస్త్రవేత్తలు ఇప్పటికే నిర్ధారించారు. అందుకే భూమిపైనే కాకుండా ఇంకా ఏ ఇతర గ్రహంలో అయినా నీటిజాడ ఉందా అని వారు ఎన్నో ఏళ్లుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. భూమి కాకుండా మానవాళి జీవించే అవకాశం మార్స్‌పైనే ఉంవచ్చని శాస్త్రవేత్తలు ఎప్పటినుండో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వారి అనుమానానికి ఒక ఆధారం దొరికింది.


మార్స్‌పై నేల అంతా ఎక్కువగా పొడిపొడిగానే ఉంటుంది. ఒక్క చోట నీటి చుక్క కనపడకుండా ఉంటుందా అని శాస్త్రవేత్తలు నమ్మకంతో పరీక్షలు చేస్తుంటారు. తాజాగా మార్స్‌లో ఒక చోట నీటి జాడ కనిపించింది. ఒకప్పుడు అక్కడ నీరు ఉందని తేలిసేలాగా వారికి కొన్ని ఆధారాలు దొరికాయి. ఒక ప్రాంతంలో వారు గుర్తించిన రాళ్లు.. అక్కడ నీరు ఉండేవని కలిగించేలా చేస్తున్నాయి. అలాంటి రాళ్లను మార్స్‌పై గుర్తించడం ఇదే మొదటిసారి అని శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటివరకు వారు ఎన్నో పరీక్షలు చేసినా.. ఇలాంటి ఆధారాలు మాత్రం మొదటిసారి దొరికాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. భూమికి పోలి ఉన్న గ్రహం మార్స్ ఒక్కటే. కానీ భూమితో పోలిస్తే.. మార్స్ మరింత వేడిగా, చాలా నీటితో ఉండేది. ఇప్పుడు అవేవి అక్కడ లేవు. కేవలం ఒక చల్లటి ఎడారిలాగా మార్స్ మారిపోయింది. అయితే ప్రస్తుతం శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నట్టుగా.. మార్స్‌పై కొన్ని బిలియన్ల ఏళ్ల క్రితం నీరు ఉండేదని తెలుస్తోంది. కానీ ఇది పూర్తిగా నిజమని నిర్ధారణ కాలేదు.


ప్రస్తుతం వారికి దొరికిన రాళ్లను డ్రిల్ చేయాలంటే కొంచెం కష్టమని.. వాటికంటే సాఫ్ట్ ఉన్న రాళ్ల కోసం అన్వేషణ మొదలుపెట్టారు. ఇదే క్రమంలో వారికి మరొక చోట కూడా నీటి జాడ కనిపించింది. ఇది కూడా వారికి నమ్మకానికి మరొక ఆధారమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ఆధారాలన్నీ మార్స్‌పై మరిన్ని పరిశోధనలు చేయడానికి శాస్త్రవేత్తలకు కొత్త ఊపునిచ్చింది.

Tags

Related News

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

Big Stories

×