EPAPER

New Zealand : రెండో స్థానానికి దించిన రెండు ఓటములు

New Zealand : రెండో స్థానానికి దించిన రెండు ఓటములు

New Zealand slips to second place in ODIs : వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ జట్టుగా భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ క్రికెట్ టీమ్… వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమితో అగ్రస్థానాన్ని కోల్పోయింది. టీమిండియాతో రెండో వన్డే తర్వాత ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో… న్యూజిలాండ్ రెండో స్థానానికి పడిపోయింది. తొలి వన్డేలో భారత జట్టు విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి గొప్పగా పోరాడి… కేవలం 12 పరుగుల తేడాతో ఓడిన కివీస్ టీమ్… రెండో వన్డేలో మాత్రం భారత బౌలర్ల దెబ్బకు 108 పరుగులకే ఆలౌటై… దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. తద్వారా వన్డేల్లో టాప్ ర్యాంక్‌ను కోల్పోయింది.


ఐసీసీ విడుదల చేసిన లేటెస్ట్ వన్డే ర్యాంకింగ్స్‌లో… తొలి స్థానంలో ఉన్న న్యూజిలాండ్ రెండో స్థానానికి పడిపోగా… రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ ఫస్ట్ ప్లేస్ కైవసం చేసుకుంది. ఇక నాలుగో స్థానంలో ఉన్న టీమిండియా… ఒక ర్యాంక్ మెరుగుపర్చుకుని మూడో స్థానానికి ఎగబాకింది. ర్యాంకుల్లో తేడా ఉన్నా… భారత్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్.. మూడు జట్లూ 113 పాయింట్లతో సమానంగా ఉండటం విశేషం. కివీస్‌తో జరిగే మూడో మ్యాచ్‌లోనూ గెలిచి 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తే… వన్డేల్లో టీమిండియా సింగిల్‌గా టాప్‌ ర్యాంక్‌కు చేరుకుం‍టుంది. ఇప్పటికే టీ-20ల్లో భారత క్రికెట్ జట్టు టాప్ ర్యాంక్‌లో ఉంది.

ఇక టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ఆస్ట్రేలియా 126 రేటింగ్‌ పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. 115 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా తర్వాత రెండో స్థానంలో భారత జట్టే ఉంది. త్వరలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే 4 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 3-1 తేడాతో కైవసం చేసుకోగలిగితే, ఈ విభాగంలోనూ భారత క్రికెట్ జట్టు టాప్ ర్యాంక్ సాధిస్తుంది. అదే జరిగితే… క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలోనూ టీమిండియా టాప్‌ పొజిషన్‌కు చేరుకుంటుంది.


Follow this link for more updates : Bigtv

Tags

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×