EPAPER

Apsaras : అప్సరసలు 31మంది ఉన్నారా….

Apsaras : అప్సరసలు 31మంది ఉన్నారా….

Apsaras : ఒక అమ్మాయి అందంగా వుంటే అప్సరసలా ఉంది అంటారు .పురాణముల ప్రకారం దేవలోకంలో ఎందరో అప్సరసలు ఉన్నారు. బ్రహ్మ పురాణం ప్రకారం అప్సరలు 31మంది ఉన్నారు. అప్సరసలు అంటే అందరికీ గుర్తొచ్చేది రంభ,ఊర్వశి, మేనక, తిలోత్తమలే మనకు గుర్తొస్తారు. అప్సరసలు తమ సౌందర్యంతో ఎంతోమంది దీక్షలను భగ్నం చేసి ఎన్నో ప్రళయాలు జరగకుండా ఆపగలిగారు. అదేవిధంగా మరెంతో మంది మునులు తపస్సు భగ్నం కారణంగా శాపానికి గురైన వారు ఉన్నారు. ఎన్నో యుగాలు మారిన తమ అందం మాత్రం తగ్గని వారే ఈ అప్సరసలు. నిజానికి అప్సరసలు 31 మంది. వీరిని ఏకత్రింశతి అప్సరసలు అని కూడా అంటారు.


రంభ, మేనక, ఊర్వశి, తిలోత్తమ, సుభోగ, విశ్వాచి, విపులానన, భద్రాంగి, చిత్రసేన, ప్రమోచన, ఘృతాచి, సహజన్య మ్లోచ, వామన, మండోదరి, ప్రమ్లోద, మనోహరి, మనో మోహిని, రామ, చిత్రమధ్య, శుభానన,సుకేశి, నీలకుంతల, మన్మదోద్ధపిని, అలంబుష, మిశ్రకేశి, పుంజికస్థల, క్రతుస్థల,వలాంగి, పరావతి, మహారూప, శశిరేఖ వంటి 31 మందిని అప్సరసలుగా పిలిచేవారు.

అసలు అప్సరసల పుట్టుక వెనుక రకరకాల కథలు ఉన్నాయి బ్రహ్మ పిరుదుల నుండి పుట్టిన రాక్షసులు వెంటపడితే విష్ణుమూర్తి ఉపాయంతో బ్రహ్మ తన శరీరాన్ని విడిచి పెట్టాడట. అప్పుడే తన చేతిని సంతోషంతో వాసన చూసుకున్నాడట. అప్పుడు గంధర్వులూ అప్సరసలూ పుట్టారట. అలాగే క్షీర సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు అప్సరసలు పుట్టారని కూడా చెపుతారు!


Follow this link for more updates:- Bigtv

Tags

Related News

Dussehra 2024 Date: ఈ ఏడాది దసరా పండుగ ఏ రోజున జరుపుకుంటారు ? శుభ సమయం, ప్రాముఖ్యత వివరాలు ఇవే..

Sun Transit Horoscope: సూర్యుని దయతో ఈ రాశుల వారికి గోల్డెన్ టైం రాబోతుంది

Tirumal Laddu: పవిత్ర తిరుమల లడ్డూ తయారీలో 8 మంది కీలక పాత్ర, ఇంతకీ వాళ్లు ఎవరో తెలుసా?

Tulasi Plant: తులసి పూజ ఎప్పుడు చేయాలి, వాయు పురాణం ఏం చెబుతోందంటే..

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Big Stories

×