EPAPER
Kirrak Couples Episode 1

January 11, Tegimpu Review: తెగింపు రివ్యూ.. అజిత్ సినిమా ఎలా ఉందంటే…

January 11, Tegimpu Review: తెగింపు రివ్యూ.. అజిత్ సినిమా ఎలా ఉందంటే…


బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి పోరు నేటి నుంచి ప్రారంభమైంది. అయితే ఈ సారి సంక్రాంతి పోరులో అందరి చూపు.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న “వాల్తేరు వీరయ్య”, నందమూరి నటసింహాం బాలకృష్ణ నటిస్తున్న “వీర సింహా రెడ్డి” పైనే ఉన్నాయి. కానీ ఈ పోటీలో  “తెగింపు” (Tegimpu Review) “వారసుడు”తో తమిళ స్టార్స్ అజిత్, విజయ్ కూడా ఉన్నారు. వీరికి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. వీరి సినిమాలు ఎలాంటి సంచలనాలైనా సృష్టించగలవు. మరి నేడు విడులైన అజిత్ “తెగింపు” చిత్రం అలాంటి సంచలనాలను సృష్టించి సంక్రాంతి బరిలో నిలుస్తుందా ? లేదా అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :


వైజాగ్ లోని యూవర్ బ్యాంక్ లో రూ. 500 కోట్ల దోపిడి చేయడానికి ఓ గ్యాంగ్ ప్లాన్ చేసి, బ్యాంక్ లోకి వెళ్తారు. అలాగే బ్లాక్ డేవిల్ (అజిత్ కుమార్), కన్మణి (మంజూ వారియర్) కూడా అదే బ్యాంక్ ను కాజేయడానికి అక్కడికి వస్తారు. వీరితో పాటు మూడో గ్యాంగ్ కూడా ఉంటుంది. ఈ మూడో గ్యాంగ్ ఎవరిది ? ఇంటర్నేషనల్ క్రిమినల్ అయిన, బ్లాక్ డేవిల్ యూవర్ బ్యాంక్ ను ఎందుకు టార్గెట్ చేస్తాడు ? ఆ బ్యాంక్ లో రూ. 500 కోట్లు కాకుండా ఇంకా ఏం ఉంది ? దానికి ఆ బ్యాంక్ చైర్మెన్ క్రిష్‌ (జాన్ కొక్కెన్) కు సంబంధమేమిటి? ఈ బ్యాంక్ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తోంది ? ప్రజలకు వెళ్లాల్సిన 25,000 కోట్లను అజిత్ ఎలా చేర్చాడు? అనేది మిగితా స్టోరి.

విశ్లేషణ :

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ సినిమాలంటే.. హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ను భారీ స్థాయిలో అంచనా వేయవచ్చు. అలాంటి యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రంలో చాలా ఉన్నాయి. సినిమా ప్రారంభం నుంచి గన్స్ నుంచి వచ్చే తూటాల మోతలు.. బాంబ్ ల శబ్ధాలతో థియేటర్ వణికిపోతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో సముద్రంలో ఉండే ఛేజింగ్ సీన్ సినిమాకు హైలైట్ గా ఉంటుంది. అలాగే అజిత్ స్టైలీష్ లుక్ ఆయన ఫ్యాన్స్ కు కిక్ ఇస్తుంది.

డైరెక్టర్ హెచ్. వినోద్ కథ, కథనంపై కంటే.. యాక్షన్ ఎపిసోడ్స్ పై ఎక్కువగా కాన్సంట్రేషన్ చేసినట్టున్నాడు. అందుకే కొన్ని సీన్స్ లాజిక్ కు అందకుండా ఉంటాయి. మరి కొన్ని సిన్స్ సినిమాటిక్ గా ఉంటాయి. అజిత్ యాక్షన్ ఎపిసోడ్స్ వల్ల కొన్ని మరిచిపోయినా, మరి కొన్ని మాత్రం మన కళ్లకు దొరికిపోతాయి. అయితే తెగింపు రోటీన్ స్టోరీ అయినా, యాక్షన్ హంగులు దిద్దడం వల్ల కాస్త కొత్తగా అనిపిస్తోంది. ఈ యాక్షన్ హంగులే సినిమాకు ప్లస్ పాయింట్.

దీంతో పాటు సినిమాలో ఇచ్చిన సోషల్ మెసేజ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఫైనాన్షియల్ క్రైమ్ గురించి సినిమాలో అద్భుతంగా చూపించారు. బ్యాంకింగ్ మోసాలు, క్రెడిట్ కార్డ్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ప్రజలను కొంత మంది ఎలా మోసం చేస్తున్నారు అనే విషయాన్ని చూపించిన తీరు బాగుంది.

సముథ్ర ఖని, అజిత్ వంటి ప్రముఖ నటులు సినిమాలో ఉన్నా.. వారి మార్క్ కనిపించదు. వీరి నుంచి ఇంకా ఫర్మామెన్స్ ను తీసుకురావడంలో డైరెక్టర్ విఫలమయ్యాడని చెప్పొచ్చు. అలాగే మంజు వారియర్ పాత్రను మరింత బలంగా చూపించాల్సింది. అలాగే గిబ్రన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ అవడానికి ఈ మ్యూజిక్ చాలా ఉపయోగపడింది. ఎడిటింగ్ కాస్త మెరుగ్గా చేయాల్సింది. సినిమాటోగ్రఫి బాగుంది.

ప్లాస్ పాయింట్స్ :

అజిత్ కుమార్
యాక్షన్ సన్నివేశాలు
బ్యాగ్రౌండ్ మ్యూజిక్
క్లైమాక్స్ లోని సముద్రంలోని ఛేజింగ్ సీన్
సోషల్ మెసేజ్

మైనస్ పాయింట్స్ :

కొన్ని లాజిక్ లేని సీన్స్
రోటీన్ క్లైమాక్స్
కొన్ని ల్యాగ్ సిన్నివేశాలు
కథనం

మొత్తంగా.. ఒకసారి చూడటానికి తెగించవచ్చు

Related News

Aishwarya Rajesh: బాధేస్తుంది.. అవుట్‌డోర్ షూటింగ్‌కు వెళ్తే అక్క‌డ జ‌రిగేది ఇదే: ఐశ్వ‌ర్య రాజేష్‌

Actress Jhansi: లైంగిక వేధింపుల కమిటీకి చైర్మన్ గా ఝాన్సీ.. గతంలో ఆమె చేసిన పనులు తెలిస్తే షాకే..?

Devara Run Time : ఫియరే లేని దేవరకు ఫియర్ పట్టుకుందా… మరీ ఇంత కట్ చేశారేంటి.?

Highest Paid Actress: ఇండియాలోనే హైయేస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ ఎవరంటే?

Big Tv Exclusive : దసరాకి గేమ్ ఛేంజర్ ట్రైలర్… చెర్రీ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ కు రెడీ అవ్వండమ్మా

Manchu Vishnu: పవన్ కు సపోర్ట్ సరే.. పూనమ్ ఇచ్చిన ఫిర్యాదు సంగతేంటీ.. ప్రెసిడెంట్ గారు ?

Jayam Ravi : జయం రవితో ఎఫైర్ పై ప్రశ్న… నెటిజన్ కు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చిన సింగర్

Big Stories

×