BigTV English

Natu Natu Song : నాటు నాటు పాట.. 80 వెర్షన్స్‌.. ఆ స్టెప్ కు 18 టేక్‌లు..

Natu Natu Song : నాటు నాటు పాట.. 80 వెర్షన్స్‌.. ఆ స్టెప్ కు 18 టేక్‌లు..

Natu Natu Song : నాటు నాటు పాట ప్రేక్షకులను థియేటర్లలో ఉర్రూతలూగించింది. చిన్న ,పెద్ద ప్రతి ఒక్కరూ ఈ పాటను బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకమైన ‘గోల్డెన్ గ్లోబ్‌‌’ అవార్డు ఆ గీతానికి దక్కింది. ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘నాటు నాటు’ ఈ అవార్డును సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ సొంతం చేసుకున్న ఈ పాట కోసం చిత్రబృందం ఎంతో కష్టపడింది. ఈ పాట చిత్రీకరణ వెనుక ఆసక్తికర విషయాలను దర్శకుడు రాజమౌళి గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.


రాజమౌళి చెప్పిన వివరాల ప్రకారం..ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ పై ఓ మాస్‌ సాంగ్‌ తీయాలనున్నారు. సినిమాలోని పాటలకంటే ఈ గీతం భిన్నంగా ఉండాలని భావించారు. ఈ పాటను ఉక్రెయిన్‌లో చిత్రీకరణ చేశారు. అప్పటికి ఇంకా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభంకాలేదు. పాటలో కనిపించే భవనం సెట్ కాదు ఒరిజినల్. అది ఉక్రెయిన్‌ అధ్యక్షుడి భవనం. ఆ ప్యాలెస్‌ పక్కనే పార్లమెంట్‌ భవనం ఉంది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఒకప్పుడు టెలివిజన్‌ యాక్టర్‌ . RRR టీమ్ అడగగానే పాట చిత్రీకరణకు అనుమతి ఇచ్చారు. జెలెన్‌స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడు కాకముందు ఒక టెలివిజన్‌ సిరీస్‌లో అధ్యక్షుడి పాత్ర పోషించారు. ఈ విషయాలన్నీ రాజమౌళి ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఎం.ఎం.కీరవాణి అందించిన జోష్ నిచ్చే స్వరాలకు చంద్రబోస్‌ దుమ్ముదులిపే సాహిత్యం సమకూర్చారు. రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ తమ గానంతో పాటను కిక్కెంకించారు. ప్రేమ్‌ రక్షిత్‌ కొరియోగ్రఫీ అదుర్స్ అనిపించింది. ‘నాటు నాటు’లో హుక్‌ స్టెప్‌ కోసం 80కిపైగా వేరియేషన్‌ స్టెప్స్‌ను ప్రేమ్‌ రక్షిత్‌ బృందం రికార్డు చేసిందట. చివరకు భుజాలపై చేతులు వేసుకుని ఇద్దరూ ఒకే రకంగా కాళ్లు కదిపే స్టెప్‌ను ఓకే చేశారు. చిత్రీకరణ సమయంలో ఇద్దరు హీరోలు సింక్‌ అయ్యేలా స్టెప్‌ రావడానికి 18 టేక్‌లు తీసుకున్నారట. డ్యాన్సులు విరగదేసే ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ 18 టేక్‌లు తీసుకున్నారంటే పాట పర్‌ఫెక్ట్‌గా రావడానికి రాజమౌళి ఎంతగా తపించారో తెలుస్తోంది. హీరోలిద్దరూ స్టెప్స్‌ వేస్తుంటే దుమ్ము లేవటం లేదని రాజమౌళి రీటేక్‌ చేయించారని సినిమా ప్రమోషన్స్‌ సమయంలో ఎన్టీఆర్‌ చెప్పారు.


మరోవైపు నాటు నాటు పాట ‘ఆస్కార్‌’ షార్ట్‌లిస్ట్‌లోనూ ఉత్తమ సాంగ్‌ విభాగంలో చోటు దక్కించుకుంది. ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌లో ఎంపికైన చిత్రాలకు జనవరి 12 నుంచి 17 వరకూ ఓటింగ్‌ నిర్వహిస్తారు. ఆ ఓటింగ్‌ ఆధారంగా జనవరి 24న ఆస్కార్ నామినేషన్‌లో నిలిచిన చిత్రాలను ప్రకటిస్తారు. మార్చి 12న విజేతలకు ఆస్కార్‌ అవార్డులు అందిస్తారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×