ప్రస్తుతం చాలా మంది పెరిగిన బరువుతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు యోగా చేయడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు.
యోగాసనాలు శరీర కొవ్వును తొలగించడంలో చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి.
కొన్ని రకాల యోగాసనాలు శరీరంలో జీవక్రియ రేటును పెంచడంలో కూడా సహాయపడతాయి.
బరువు తగ్గడానికి సూర్య నమస్కారం ఉత్తమ యోగాసనం.
వీరభద్రాసనం బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
క్రమం తప్పకుండా ఈ ఆసనం
చేయడం వల్ల కాళ్ల కండరాలు బలపడతాయి.
నవసనా ఆసనం పొట్ట కొవ్వును తగ్గించడంలో బాగా పనిచేస్తుంది.
ఉత్కటాసనం వల్ల తొడలు, కాళ్ల కండరాలు, వెన్నెముక బలపడతాయి.
సేతు బంధాసనం దిగువ శరీరంలోని కొవ్వును తొలగిస్తుంది.
ఈ ఆసనం థైరాయిడ్ గ్రంధిని ప్రేరేపిస్తుంది. థైరాయిడ్ సమస్య రాకుండా కూడా చేస్తుంది