అధిక బరువుతో ప్రస్తుతం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అధిక బరువు వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి.

యోగా వల్ల పెరిగిన బరువును ఈజీగా తగ్గించుకోవచ్చు. ఇంట్లో చేసే కొన్ని ఆసనాలతో బరువు తగ్గుతారు.

యోగాసనాలు శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలను తగ్గిస్తాయి.మనసు రిలాక్స్‌గా మారుతుంది.

యోగా వల్ల  బరువు తగ్గడమే కాకుండా కండరాలు, అంతర్గత అవయవాల పనితీరు మెరుగ్గా పనిచేస్తుంది.

ఈజీగా బరువు తగ్గించే యోగాసనాల ఇవే..

వజ్రాసనం: ఈ ఆసనం వల్ల తొడలు, పొట్ట భాగంలోని  కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.

ధనురాసనం: ఈ ఆసనం వల్ల పొత్తి కడుపు బిగుతుగా మారి పొట్ట, నడుము భాగంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది.

చతురంగాసనం: ఈ ఆసనం వల్ల చేతులు, ఛాతీ ప్రాంతం, పొత్తికడుపు ప్రాంతాల్లో  కొవ్వు నిల్వలు బర్న్ అవుతాయి.

వీరభద్రాసనం: ఈ ఆసనం వల్ల  తొడలు, పొత్తికడుపులో వదులుగా ఉన్న కండరాలు బిగుతుగా మారడమే కాకుండా ఆ ప్రాంతాల్లో కొవ్వు తగ్గుతుంది.