ఈ జనరేషన్ ఆకుకూరలకు చాలా దూరం.

పిల్లలైతే తినడానికి కూడా ఇష్టపడరు. బేకరీ, జంక్ ఫుడ్స్ కే మొగ్గు చూపుతారు.

ఆకుకూరల్లో తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిది. రోగాలు రాకుండా కాపాడుతుంది.

 ఐరన్ లోపం ఉన్న వాళ్లు ప్రతిరోజూ తోటకూరను తింటే మంచిది.

విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కెతో పాటూ ఫోలేట్ కూడా ఉంటుంది.

కంటిచూపును మెరుగుచేస్తుంది. చర్మ సౌందర్యం, జుట్టు ఎదుగుదలకు కూడా ఉపయోగపడుతుంది.

తోటకూరకు క్యాన్సర్ ను రాకుండా అడ్డుకునే శక్తి ఉంది.

ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

యాంటీ ఆక్సిడెంట్లు అధికం. బ్యాక్టీరియా, వైరస్ ల నుంచి కాపాడుతుంది.

బరువు తగ్గాలనుకునేవారు తరచూ తోటకూరను ఆహారంలో తీసుకోవాలి.

ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణ సమస్యలు, మలబద్దకం వంటి సమస్యలు రావు.