వివో తాజాగా మరో చౌక స్మార్ట్‌ఫోన్ Vivo Y36cని చైనా మార్కెట్లోకి విడుదల చేసింది.

ఇది రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో బేస్ వేరియంట్ 6 GB RAM + 128 GB స్టోరేజ్ ధర 899 యువాన్ (సుమారు రూ. 10,500)గా ఉంది.

అలాగే టాప్ వేరియంట్ 12 GB RAM + 256 GB స్టోరేజ్‌ ధర 1299 యువాన్ (సుమారు రూ. 15,500)గా కంపెనీ నిర్ణయించింది.

ఇది మూన్ షాడో బ్లాక్, డిస్టెంట్ మౌంటైన్ గ్రీన్, డైమండ్ పర్పుల్ అనే మూడు కలర్ వేరియంట్‌లలో అందుబాటులోకి వచ్చింది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ని కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక పూర్తి స్పెసిఫికేషన్ల విషయానికొస్తే..

ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.56 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 840 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది.

కంపెనీ అందులో తక్కువ బ్లూ లైట్ సర్టిఫికేషన్ కూడా ఇచ్చింది. ఫోన్‌లో వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ ఇవ్వబడింది. దీని సెల్ఫీ కెమెరా నాచ్‌లో అమర్చబడింది.

ప్రాసెసింగ్ విషయానికొస్తే.. కంపెనీ ఇందులో MediaTek Dimensity 6300 చిప్‌సెట్‌ని ఉపయోగించింది.

ఫోన్ వెనుక భాగంలో రెక్టాగ్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా అందించబడింది.

ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది దుమ్ము, నీటి నుండి రక్షణ కోసం IP54 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది. పరికరం 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.