టెక్ బ్రాండ్ వివో తాజాగా Vivo Y18i పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.
4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ రూ.7,999 ధరతో అందుబాటులోకి వచ్చింది.
Vivo అధికారిక వెబ్‌సైట్‌తో సహా ఆఫ్‌లైన్ రిటైలర్లలో ఈ స్మార్ట్‌ఫోన్ సేల్కు అందుబాటులో ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 6.56 అంగుళాల HD + LCD డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 1612 × 720 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వస్తుంది.
90Hz రిఫ్రెష్ రేట్, 528 నిట్స్ బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది. Android 14 ఆధారిత Funtouch OS 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా విస్తరించవచ్చు.
అలాగే Unisoc T612 ప్రాసెసర్ ఉంది. Vivo Y18i ఫోన్ 15W ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక 13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 0.08-మెగాపిక్సెల్ సహాయక (auxiliary) కెమెరా ఉంది.
ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించబడింది. అలాగే దీనికి IP54 రేటింగ్ ఇవ్వబడింది.
ఇందులో డ్యూయల్ సిమ్ సపోర్ట్, 4G, బ్లూటూత్ 5.0, USB టైప్ C పోర్ట్, FM సపోర్ట్ వంటివి ఉన్నాయి.