స్మార్ట్ ఫోన్ కంపెనీలు గ్యాప్ లేకుండా కుప్పలు కుప్పలుగా ఫోన్లను విడుదల చేస్తున్నాయి.

Vivo కొత్త ఫోన్లను విడుదల చేయడానకి సిద్ధమైంది. తన S సిరీస్ నుంచి S19, S19 Pro ఫోన్లను తీసుకురానుంది.

మే 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే అధికారిక వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.

Vivo S19 స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల ఫ్లాట్ OLED ప్యానెల్‌ కలిగి ఉంది. 

ఇది 1.5K రిజల్యూషన్‌తో 4500 నిట్‌ల పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది.

S19 Pro కూడా 1.5K రిజల్యూషన్‌‌తో 6.78-అంగుళాల ఫ్లాట్ OLED ప్యానెల్‌ కలిగి ఉంటుంది.

ఈ ఫ్లాగ్‌షిప్ MediaTek డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్‌తో ఉంటుంది.

రెండు ఫోన్ కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల కోసం NFCతో వస్తాయి.