వివో కంపెనీ త్వరలో తన లైనప్‌లో ఉన్న Vivo V40e ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది.

ఈ నెల అంటే సెప్టెంబర్ చివరి నాటికి పరిచయం చేయబడుతుందని టాక్ వినిపిస్తోంది.

కాగా కంపెనీ ఈ V-seriesలో ఇప్పటికే Vivo V40, Vivo V40 Pro ఫోన్లను విడుదల చేసింది.

ఇక ఈ సిరీస్‌లో తన రాబోయే Vivo V40e ఫోన్ టోన్డ్ డౌన్ వెర్షన్ కావచ్చని చెప్పబడింది.

ఈ ఫోన్‌లో 4500 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్ అందించే అవకాశం ఉంది.

అంతేకాకుండా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14పై రన్ అవుతుందని ఇటీవలి కొన్ని లీక్‌లు వెల్లడించాయి.

కంపెనీ ఇందులో MediaTek Dimensity 7300 చిప్‌సెట్ అందించిందని చెప్పబడింది.

అలాగే ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5500mAh కెపాసిటీ గల పెద్ద బ్యాటరీని కలిగి ఉంది.

Vivo V40e గతంలో ఇండియన్ సర్టిఫికేషన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)లో కూడా కనిపించింది.

అక్కడ V203 మోడల్ నంబర్‌తో దర్శనమిచ్చింది. కాగా ఇందులో 8 జీబీ ర్యామ్ ఉంటుందని చెప్పబడింది.