ఎలక్ట్రిక్ దిగ్గజం వివో దేశీయ మార్కెట్‌లో వరుసగా స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తోంది.

 బడ్జెట్ సెగ్మెంట్‌లో కూడా మంచి ఫీచర్లతో కూడిన ఫోన్లను తీసుకొస్తుంది

ప్రీమియం మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ Vivo V40 Series విడుదల చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది.

వివో V40 సిరీస్‌లో Vivo V40, Vivo V40 Liteలను పరిచయం చేయాలని భావిస్తోంది.

కంపెనీ ఇటీవల చైనాలో రెండు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది.

భారతదేశంలో కూడా అదే వేరియంట్‌లను తీసుకొచ్చే అవకాశం ఉంది.

ఈ ఫోన్‌ను ఆగస్టు 7న విడుదల చేయనుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ 1260×2800 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది.

డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్, 4500 nits వరకు పీక్ బ్రైట్నెస్‌లను అందిస్తోంది.