త్వరలో ఐఫోన్ 16 సిరీస్ లాంచ్‌ కానుంది. దానికంటే ముందు ఐఫోన్ 15 సిరీస్‌ ఫోన్లపై అయిదిపోయే డిస్కౌంట్లు అందుబాటులోకి వచ్చాయి.

ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ విజయ్ సేల్స్ ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ విజయ్ సేల్స్‌లో ఇండిపెండెన్స్ డే సేల్ కొనసాగుతుంది. ఇందులో iPhone 15, iPhone 15 Plus ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్‌లు పొందొచ్చు.

iPhone 15 ఫోన్‌లోని 128GB వేరియంట్ అసలు ధర రూ.79,900 ఉండగా ఇప్పుడు రూ.69,690కే కొనుక్కోవచ్చు.

అదే సమయంలో కొనుగోలుదారులు ICICI బ్యాంక్ లేదా SBI బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి రూ. 4,000 తగ్గింపును పొందవచ్చు.

ఈ ఆఫర్‌తో ఐఫోన్ 15 మొబైల్‌ను కేవలం రూ.65,690లకే సొంతం చేసుకోవచ్చు.

iPhone 15 ఫోన్‌తో పాటు iPhone 15 ప్లస్‌పై సూపర్ డూపర్ తగ్గింపు లభిస్తుంది.

ఐఫోన్ 15 ప్లస్‌లోని 128GB వేరియంట్‌ లాంచ్ సమయంలో రూ. 89,900కి అందుబాటులోకి వచ్చింది.

తాజా తగ్గింపుతో దీనిని రూ. 77,190కి కొనుక్కోవచ్చు. అంతేకాకుండా బ్యాంక్ డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

దాదాపు రూ.4,000 అదనపు తగ్గింపు పొందొచ్చు. దీంతో iPhone 15 Plus ను రూ. 73,190కి సొంతం చేసుకోవచ్చు.