కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2024-25 ను ప్రవేశ పెట్టింది

ఏయే వస్తువుల ధరలు తగ్గనున్నాయి.. ఏవి పెరగనున్నాయంటే..?

మొబైల్ ఫోన్లు, ఛార్జర్లపై బీసీడీని 15 శాతానికి కేంద్రం తగ్గించింది

బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీని 6 శాతానికి తగ్గించారు

అదేవిధంగా ప్లాటినంపై కూడా 6.4 శాతానికి తగ్గించారు

క్యాన్సర్ చికిత్స కు సంబంధించిన 3 ఔషధాలకు ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుంచి మినహాయింపు ఇచ్చారు

ఈ కామర్స్ సంస్థలకు టీడీఎస్‌ను తగ్గించారు. ఈ కారణంగా ఆన్‌లైన్ షాపింగ్‌లో ధరలు తగ్గనున్నాయి

నిర్దేశిత టెలికాం పరికరాలపై ప్రాథమిక కస్టమ్ డ్యూటీని 15 శాతానికి పెంచారు

ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గనున్నాయి