ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ Ulefone తాజాగా ఆర్మర్ 27T ప్రో (Armor 27T Pro)ని విడుదల చేసింది.

ఈ ఫోన్‌లో MediaTek Dimensity 6300 5G చిప్‌సెట్ ఉంది.

దీని బ్యాటరీ కూడా చాలా పెద్దది. ఇది దాదాపు 10600mAh బ్యాటరీని కలిగి ఉంది.

అంతేకాదండోయ్ ఈ ఫోన్ 24GB RAM వరకు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ ఫోన్ థర్మల్ ఇమేజింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

ఇది $269.99గా ఉంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం.. సుమారు రూ. 22,600 అన్నమాట.

ఈ ఫోన్ రెండు వేరియంట్లలో వస్తుంది. అందులో ఒకటి FLIR థర్మల్ కెమెరాని కలిగి ఉంటుంది.

అదే సమయంలో దాని ఆల్టర్‌నేటివ్ వేరియంట్‌లో 50MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉంది.

ఇది కాకుండా ఫోన్‌లో సెకండరీ సెన్సార్‌గా 64MP OMNIVISION OV64B సెన్సార్ అందించబడింది.

ఈ ఫోన్ రాత్రిపూట లేదా చీకటిలో అద్భుతంగా ఫోటోలను క్యాప్చర్ చేయగలదు.

ఈ రెండు మోడళ్ల సేల్స్ ఇవాళ్టి నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ ఫోన్ Aliexpressలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.