ఒత్తిడి తగ్గించుకునే టిప్స్

నేటి జీవన విధానంలో ఒత్తిడి అనేది సహజం.

ఒత్తిడికి లోనైనప్పుడు నిండుగా గాలి పీల్చుకుని మెల్లిగా వదిలేయండి.

ఇష్టమైన మ్యూజిక్ వినండి. టీ లేదా కాఫీ తాగండి.

కొన్ని మీటర్లు నడవండి. ఏకాంతంతోపాటు ఆలోచనలు సరిచేసుకునే సమయం దొరుకుతుంది.

ఒకటి నుంచి పది లెక్కించండి.. అలాగే వెనక్కి లెక్కించండి. టెన్షన్ కంట్రోల్ అవుతుంది.

కళ్లు మూసి కాసేపు ఏదీ ఆలోచించకండి.

మెడిటేషన్ లేదా.. యోగా చేయండి.

ఇబ్బంది పెట్టే విషయాలేవో పేపర్ పై రాయండి. సగం ఒత్తిడి ఆవిరైపోతుంది.

ఎక్కువ మాట్లాడే, బాతాఖానీ పెట్టే ఫ్రెండ్స్‌తో కాసేపు హుషారుగా మాట్లాడే ప్రయత్నం చేయండి.

మీరు ఫ్రీగా, రిలాక్స్‌గా గడిపేలా ఓ ప్లేస్ క్రియేట్ చేసుకోండి. అది కూర్చునే కుర్చీ అయినా.. ఇంటి టెర్రస్ అయినా సరే.