క్యాన్సర్ శరీరంలో మెత్తగా ఉన్న అవయవాల్లోనే కాదు.. దృఢంగా ఉండే ఎముకల్లోనూ వస్తుంది.

శరీరంలో ఉండే 206 ఎముకల్లో ఎక్కడైనా క్యాన్సర్ కణితులు రావొచ్చు.

బోన్ క్యాన్సర్ కు సంకేతం ఎముకలలో నొప్పి. ఏం చేసినా అది తగ్గదు.

శరీరంపై గడ్డలు కట్టడం, వాపు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

చేతులు, కాళ్లు, పొత్తికడుపు వంటి ప్రాంతాల్లో ఎముకల పై వాపు కనిపిస్తే బోన్ క్యాన్సర్ ఉన్నట్టే.

జ్వరం రావడం, రాత్రి వేళ చెమటలు పట్టడం కూడా ఒక లక్షణమే. ఇలా జరిగితే బోన్ క్యాన్సత్ అధునాతన దశలో ఉందని అర్థం.

ఎముకలు బలహీనపడి వాటిపై పగుళ్లొస్తాయి. రోజువారీ పనులు చేయరు. ఎముకలు పెళసుగా మారుతాయి.

ఎక్కడైతే బోన్ క్యాన్సర్ కణితి వచ్చింది.. అక్కడ నొప్పి ఎక్కువగా ఉంటుంది.

కాళ్లు, చేతుల్లో వచ్చినట్టైతే తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఫలితంగా జీవన నాణ్యత తగ్గుతుంది.