2025లో ఇండియా తరపున ఆస్కార్ రేసుకు సెలక్ట్ అయ్యింది ‘లాపతా లేడీస్’. గత పదేళ్లుగా ఆస్కార్ బరిలో నిలిచిన ఇండియన్ సినిమాలపై ఓ లుక్కేయండి.

2024లో మలయాళం మూవీ ‘2018’ ఆస్కార్ బరిలో నిలిచింది.

2023లో గుజరాతీ సినిమా ‘లాస్ట్ ఫిల్మ్ షో’ ఆస్కార్‌కు సెలక్ట్ అయ్యింది.

2022లో ఇండియా తరపున ‘పెబెల్స్’ అనే తమిళ చిత్రం ఆస్కార్ లిస్ట్‌లో చేరింది.

2021లో మరో తమిళ చిత్రం ‘జల్లికట్టు’ ఆస్కార్ కోసం షార్ట్‌లిస్ట్ చేయబడింది.

2020లో హిందీ సినిమా ‘గల్లీ బాయ్’ ఆస్కార్ కోసం షార్ట్‌లిస్ట్ అయ్యి వెనుదిరిగింది.

2019లో అస్సామీస్ చిత్రం ‘విలేజ్ రాక్‌స్టార్స్’ ఆస్కార్ బరిలోకి దిగి అందరినీ ఆశ్చర్యపరిచింది.

2018లో హిందీ సినిమా ‘న్యూటన్’ ఆస్కార్స్‌లోని ఇండియన్ ఎంట్రీస్‌లో చోటు దక్కించుకుంది.

2017లో విడుదలయిన తమిళ మూవీ ‘విసారనయ్’ ఆస్కార్ రేసులోకి వెళ్లే ఛాన్స్ కొట్టేసింది.

2016లో మరాఠీ మూవీ ‘కోర్ట్’కు ఆస్కార్ రేసులో నిలబడి ఓడిపోయింది.