జొన్నల్లో పోషకాలు మెండుగా ఉంటాయి.

చిరుధాన్యాల్లో జొన్నలు ప్రధానమైనవి. జొన్న రొట్టెలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

గోధుమ పిండి రొట్టెల కంటే జొన్న రొట్టె ఆరోగ్యానికి చాలా మంచిది.

జొన్నలతో తయారు చేసే రొట్టెలు ఎంతో శక్తి వంతమైన ఆహారం.

జొన్నల రొట్టె తినడంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది.

జొన్నల రొట్టెల్లో ఫైబర్  ఎక్కువగా ఉంటుంది. జీర్ణ క్రియకు చాలా మంచిది.

జొన్నలతో తయారు చేసిన రొట్టెల్లో ఐరన్ కూడా మెండుగా లభిస్తుంది. రక్త హీనత సమస్యతో బాధపడేవారికి మంచిది.

ఈ రొట్టెలను తింటే శరీరంలో వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంటాయి.

బరువు తగ్గాలనుకునేవారు ఈ రొట్టెలను తినాలి. వీటిని తినడంతో తక్షణమే ఎనర్జీ లెవల్స్ కూడా పెరుగుతాయి.

శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను నశింప జేస్తుంది. జొన్నె రొట్టెలు తినడంతో కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా తగ్గుతాయి.

గుండె ఆరోగ్యానికి మంచిది. అదే విధంగా డయాబెటీస్, బీపీ ఉన్నవారు కూడా వీటిని తినొచ్చు.