ఏడు వారాలా నగలు ఎందుకు ధరించేవారో  తెలుసా?

జీవితంలో బాగా కలిసొస్తుందని రంగురాళ్ల ఉంగరాలు ధరిస్తుంటారు చాలా మంది.

అలాగే పూర్వం స్త్రీలు రోజుకొక దేవుని అనుగ్రహం పొందేందుకు  ఏడు రోజులు  ఏడువారాల నగలు ధరించేవారట. అందుకే వీటికి ఏడు వారాల నగలు అనే పేరొచ్చింది.

ఆదివారం  సూర్య భగవానుడి అనుగ్రహం కోసం హారాలు, కెంపులతో చేసిన జుంకాలు.

సోమవారం  చంద్రుని కోసం ముత్యాల హారాలు, గాజులు

మంగళవారం   కుజుడి అనుగ్రహం  పొందటం కోసం పగడాల ఉంగరాలు, దండలు

బుధవారం  బుధుడు కోసం పచ్చల పతకాలు, గాజులు

గురువారం  బృహస్పతి అనుగ్రహం కోసం పుష్యరాగం కమ్మలు, ఉంగరాలు

శుక్రవారం   శుక్రుడు అనుగ్రహం పొందటం కోసం వజ్రాల హారాలు, ముక్కుపుడక

శనివారం  శనిదేవునికై నీలమణి హారాలు

ఈ ఏడు వారాల నగలు ధరించడం వల్ల మహిళలకు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు, అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్మేవారట.

అందుకే ఇప్పటికీ ఈ పేరు వినగానే మగువల మొహం వెలుగుపోతుంది.