చర్మం సాగినా, దగ్గరగా అయినా చారలు పడుతాయి.
హార్మోన్లలో వచ్చే మార్పుల వల్ల ఛాతీ, తొడలు, పిరుదులపై ఈ మార్క్స్ ఏర్పడుతాయి.
మహిళలకు ప్రెగ్నెన్సీ సమయంలో ఈస్ట్రోజన్ పెరగడంతో ఛాతీ పెరిగి స్ట్రెచ్ మార్క్స్ పడతాయి.
రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగితే ఇవి రావు.
చర్మానికి మాయిశ్చరైజర్ రాయాలి, అలాగే మృతకణాలను పోగొట్టేందుకు ఎక్స్ ఫోలియేషన్ చేయాలి
విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు తినాలి.
అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహారాలను తీసుకోవాలి.
వాల్ నట్స్, అవిసెగింజలు, చియాసీడ్స్, సాల్మన్ ఫిష్, క్యాలీ ఫ్లవర్లలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.
ఆలివ్ నూనెతో స్ట్రెచ్ మార్క్స్ పై మర్దనా చేస్తే సమస్య తగ్గుతుంది.
కొబ్బరినూనెలో కొలాజెన్ ను దెబ్బతినకుండా కాపాడే గుణం ఉంది.
కొబ్బరినూనెతో స్ట్రెచ్ మార్క్స్ పై ఇంకిపోయేలా మర్దనా చేసినా సమస్య తగ్గుతుంది.