నవ్వితే చాలు.. ఆరోగ్యానికి మేలు

స్మైల్ రక్తపోటును తగ్గిస్తుంది.

ఒత్తిడిని మటుమాయం చేస్తుంది.

రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

నవ్వితే మెదడు ఎండార్ఫిన్స్ రిలీజ్ చేస్తుంది. ఫలితంగా మనసు మంచి మూడ్‌లోకి మారుతుంది.

నవ్వుతో వచ్చే ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్.. మిమ్మల్ని యంగ్‌గా చూపిస్తుంది.

నవ్వుతో మానసికంగానే కాదు శారీరకంగానూ ఆరోగ్యం సిద్ధిస్తుంది.

మోముపై నవ్వుతో ఉండేవారిని తొందరగా నమ్ముతారు. వారికి సహాయం చేయడానికీ ముందుంటారు.

నవ్వు ఒకరి నుంచి మరొకరికి పాకే యూనివర్సల్ లాంగ్వేజ్. ఒకరు నవ్వితే చూసి నవ్వకుండా ఉండలేం.

పిల్లలు రోజులో సగటున 400 సార్లు నవ్వుతారు.

వయోజనులు 40 నుంచి 50 సార్లు మాత్రమే నవ్వుతారు. టిపికల్ పర్సన్స్ సుమారు 20 సార్లు నవ్వుతారు.