స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో మొబైల్ ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి.

తక్కువ ధరకే అప్‌డేటెడ్ ఫీచర్లు కూడిన ఫోన్లను వదులుతున్నాయి.

దీంతో మొబైల్ ప్రియులు తక్కువ ధరకే మంచి ఫోన్లను తమ సొంతం చేసుకుంటున్నారు.

స్మార్ట్‌పోన్ కంపెనీ వివో తన బ్రాండ్ నుండి కొత్త Y సిరీస్ ఫోన్‌ను తీసుకురానుంది.

బడ్జెట్ ప్రైస్‌లోనే Vivo Y18t, Vivo Y18i రెండు ఫోన్‌లను పరిచయం చేయనుంది.

ఈ ఫోన్‌ల లాంచ్ తేదీని కంపెనీ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

GizmoChina ఈ ఫోన్‌లను IMEI డేటాబేస్‌లో గుర్తించింది.

వీటిలో 50-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్‌తో కూడిన VGA సెన్సార్ ఉంటుంది.