నడక ఆరోగ్యానికి చాలా  మేలు చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే.  అలాగని ఎక్కువగా నడిచినా కూడా ప్రమాదమే..

ఆరోగ్యంగా ఉంటామని ఎక్కువగా నడిచినా కూడా అనేక సమస్యలు వస్తాయి.

శరీర సామర్థ్యం కంటే ఎక్కువగా వాకింగ్ చేస్తే అనారోగ్య సమస్యలు మొదలవుతాయి.

అతిగా నడవడం వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ శరీర సామర్థ్యం కంటే ఎక్కువగా నడవడం వల్ల కండరాలపై చెడు ప్రభావం పడుతుంది.

ఓవర్ వాకింగ్ కారణంగా చాలా మంది కండరాలు ఒత్తిడికి గురవుతాయి. కండరాల ఒత్తిడి నడకలో ఇబ్బందిని కలిగిస్తుంది.

మోకాలు, కీళ్ల సమస్యలు ఉన్నవారికి ఓవర్ వాకింగ్ సమస్యగా మారుతుంది. అతిగా నడవడం వల్ల మోకాళ్ల నొప్పులు పెరగవచ్చు.

వృద్ధులు ముఖ్యంగా నడకకు దూరంగా ఉండాలి. లేదంటే వారి మోకాళ్ల సమస్యలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.

అతిగా నడవడం వల్ల శరీరం అలసిపోయినట్లు అనిపిస్తుంది.

అతిగా నడవడం వల్ల శరీరంపై అధిక చెమట పట్టి శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది.