చైనీస్ టెక్ బ్రాండ్ Redmi జూలై 19న చైనీస్ మార్కెట్లో Redmi K70 Ultra స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది.

ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫస్ట్ సేల్ జూలై 20న ప్రారంభం కాగా కస్టమర్లు ఫస్ట్‌సేల్‌లో అత్యధికంగా కొనేసారు.

Redmi K70 Ultra సేల్స్‌లో అబ్బురపరచింది. అమ్మకాల పరంగా సరికొత్త రికార్డు సృష్టించింది.

సేల్స్ ప్రారంభించిన మూడు గంటల్లోనే Redmi K70 Ultra 2024 మొదటి అమ్మకాల రికార్డును బద్దలు కొట్టింది.

ఇది కాకుండా ఈ ఫోన్ అన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలోని, అన్ని ధరల విభాగాల సేల్స్‌లో అగ్ర స్థానాన్ని సాధించింది.

144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల OLED 8T LTPS డిస్‌ప్లేను కలిగి ఉంది. డైమెన్సిటీ 9300+ చిప్, D1 గ్రాఫిక్స్ చిప్ వంటివి ఉన్నాయి.

ఈ స్మార్ట్‌ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ని కలిగి ఉంది.

వెనుక భాగంలో OIS మద్దతుతో Sony IMX906 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి.

సెల్ఫీ కోసం 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.

12GB + 256GB (రూ. 29,894), 12GB + 512GB (రూ. 33,461), 16GB + 512GB (రూ. 36,807) అలాగే ఈ టాప్ వేరియంట్‌లో (రూ. 41,408) ధర కూడా ఉంది.

అంతేకాకుండా Redmi K70 అల్ట్రా ఛాంపియన్ ఎడిషన్.. లంబోర్ఘిని ఇన్‌స్పైర్ డిజైన్‌ను కలిగి ఉంది. దాని 24GB + 1TB వేరియంట్ ధర సుమారు రూ. 46,008గా ఉంది