టెక్ బ్రాండ్ రెడ్‌మి ఎలాంటి ఆర్భాటాలు లేకుండా భారతదేశంలో కొనుగోలు చేయడానికి Redmi A3xని అందుబాటులోకి తెచ్చింది.

ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. అందులో 3GB RAM/ 64 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,999గా ఉంది.

అదే సమయంలో 4 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,999గా కంపెనీ నిర్ణయించింది.

కాగా ఇది మిడ్‌నైట్ బ్లాక్, ఓషన్ గ్రీన్, ఆలివ్ గ్రీన్, స్టార్రీ వైట్ కలర్‌లలో అందుబాటులో ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 6.71 అంగుళాల IPS LCD HD+ డిస్ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.

డీసీ డిమ్మింగ్ టెక్నాలజీని కూడా ఇందులో ఉపయోగించారు. ఫోన్ ముందు, వెనుక ప్యానెల్‌లకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 సేఫ్టీ ఇవ్వబడింది.

ఇందులో Unisoc T603 ప్రాసెసర్‌ అమర్చబడింది. ఫోన్ బేస్ వేరియంట్ 3GB RAMని కలిగి ఉంది. 64 GB స్టోరేజ్ స్పేస్‌తో వస్తుంది.

ఈ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. ఇది డ్యూయల్ AI కెమెరా సెటప్‌లో వస్తుంది.

దానితో పాటు సెకండరీ లెన్స్ కూడా అందించబడింది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఫోన్ 5 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది.

ఇది Android 14లో రన్ అవుతుంది. ఫోన్ 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. దీనిని అమెజాన్‌లో కొనుక్కోవచ్చు.