ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రెడ్‌మి తాజాగా Redmi 14R పేరుతో ఓ ఫోన్‌ను చైనాలో రిలీజ్ చేసింది.

మొత్తం నాలుగు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో 4GB RAM + 128GB స్టోరేజ్ ధర CNY 1,099 (సుమారు రూ.13,000) గా ఉంది

అలాగే 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ CNY 1,499 (సుమారు Rs.17,700)గా ఉంది.

అదే సమయంలో మూడో వేరియంట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ధర CNY 1,699 (సుమారు Rs. 20,100)గా ఉంది.

ఇక దీని టాప్ రేంజ్ 8GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ వేరియంట్ CNY 1,899 (సుమారు Rs. 22,500)గా కంపెనీ నిర్ణయించింది.

ఈ Redmi 14R స్మార్ట్‌ఫోన్‌ డీప్ ఓషన్ బ్లూ, లావెండర్, ఆలివ్ గ్రీన్, షాడో బ్లాక్ కలర్‌ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

ఈ ఫోన్‌లో Snapdragon 4 Gen 2 చిప్‌సెట్ ప్రాసెసర్ అందించబడింది. అలాగే ఫోన్ ఆండ్రాయిడ్ 14లో నడుస్తుంది.

ఇది 18W ఛార్జింగ్‌కు మద్దతుతో 5160mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఇది 6.68-అంగుళాల HD+ LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది. 600నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలగి ఉంది.

ఇందులో సెకండరీ సెన్సార్‌తో పాటు 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అమర్చారు. ఫోన్ ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.