చైనీస్ టెక్ బ్రాండ్ రియల్‌‌మి తాజాగా Realme P2 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.

ఇది మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 21,999 గా ఉంది.

కంపెనీ దీనిపై రూ.2000 తగ్గింపు అందిస్తుంది. ఈ తగ్గింపుతో దీనిని రూ. 19,999 లకే సొంతం చేసుకోవచ్చు.

అలాగే దీని మిడ్ రేంజ్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 24,999లతో లాంచ్ అయింది.

దీనిని రూ.3000 తగ్గింపుతో రూ 21,999లకే సొంతం చేసుకోవచ్చు.

అదే సమయంలో దీని టాప్ రేంజ్ 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 27,999 ఉంది.

ఇప్పుడు కంపెనీ దీనిపై రూ.3000 తగ్గింపు అందిస్తుంది. దీంతో ఈ ఫోన్‌ని రూ. 24,999లకి కొనుక్కోవచ్చు. 

ఈ ఫోన్ సేల్ విషయానికొస్తే.. ఈ నెల అంటే సెప్టెంబర్ 17, 2024 నుండి ప్రారంభం అవుతుంది.

Flipkart, Realme వెబ్‌సైట్, Realme యాప్‌లో ఆసక్తిగల వినియోగదారులు సొంతం చేసుకోవచ్చు.

అందువల్ల మంచి ఆఫర్లతో కొత్త ఫోన్‌ను కొనుక్కోవాలని అనుకునేవారికి ఇది బెస్ట్‌గా చెప్పుకోవచ్చు.