ప్రముఖ టెక్ బ్రాండ్ రియల్‌మి తాజాగా Realme Narzo N61 స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది.

ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో 4GB + 64GB వేరియంట్ ధర రూ. 7,499.

అలాగే 6GB + 128GB వేరియంట్ ధర రూ. 8,499గా కంపెనీ నిర్ణయించింది.

ఈ హ్యాండ్‌సెట్ మొదటి సేల్ ఆగస్టు 6న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. మొదటి సేల్‌లో రూ. 500 కూపన్ తగ్గింపు పొందవచ్చు.

ఇది Amazon, Realme India వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్ 6.74-అంగుళాల HD+ (1,600 x 720 పిక్సెల్‌లు) LCD స్క్రీన్‌తో 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది.

ఈ హ్యాండ్‌సెట్ ArmorShell ప్రొటెక్షన్, TÜV రీన్‌ల్యాండ్ హై-రిలయబిలిటీ సర్టిఫికేషన్‌తో వస్తుంది.

డిస్‌ప్లే రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ టెక్నాలజీను కలిగి ఉంది. ఇది Unisoc T612 SoC ద్వారా 6GB RAM + 128GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది.

ఈ ఫోన్ మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు స్టోరేజ్ విస్తరించుకోవచ్చు. ఇది Android 14-ఆధారిత Realme UI 4.0తో రన్ అవుతుంది.

Realme Narzo N61 32-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ముందు కెమెరా 5-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. అలాగే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP54-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది.