Realme ఇటీవల తన లైనప్‌లో ఉన్న అతి చౌకైన 5G స్మార్ట్‌ఫోన్ Realme C63 5Gని భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది.

అయితే ఈ ఫోన్ సేల్ ఇవాళ స్టార్ట్ అయింది. ఈ రోజు నుండి ఇ-కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది.

మొత్తం మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999గా ఉంది.

అయితే ఫస్ట్ సేల్‌లో రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో అప్పుడు దీని ధర రూ. 9,999 తగ్గుతుంది.

అలాగే 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11,999గా ఉంది.

8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,999గా కంపెనీ నిర్ణయించింది.

ఈ  రెండు వేరియంట్లపై కూడా రూ. 1,000 బ్యాంక్ తగ్గింపు పొందొచ్చు.

ఈరోజు మొదటి సేల్ Realme అధికారిక వెబ్‌సైట్, ఇ-కామర్స్ సైట్ Flipkartలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే MediaTek Dimension 6300 ప్రాసెసర్ ఉంది.

10W ఛార్జింగ్‌ మద్దతుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. అలాగే ఇది Android 14 ఆధారిత Realme UI 5.0 పై పనిచేస్తుంది.