రూ.15 వేల ధరలో మంచి ఫీచర్లు గల రియల్ మి 5జీ ఫోన్‌ను కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ కొన్ని ఆప్షన్‌లు ఉన్నాయి.

రియల్ మి నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్ ఒకటి. ఈ ఫోన్ 120Hz అల్ట్రా స్మూత్ డిస్‌ప్లేతో అధిక స్క్రీన్-టు-బాడీ రేషియో, విజువల్స్ కోసం FHD+ రిజల్యూషన్‌ను కలిగి ఉంది.

MediaTek డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌తో ఆధారితమైనది. ఇది 50MP ప్రైమరీ కెమెరా, డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కూడా కలిగి ఉంది.

Amazonలో ఈ స్మార్ట్‌ఫోన్ రూ.11,999లుగా ఉంది. దీనిపై ఎలాంటి బ్యాంక్ ఆఫర్ లేదు. ఒకవేళ మిడ్, హై రేంజ్ వేరియంట్ సెలెక్ట్ చేసుకుంటే కూపన్ కోడ్‌లు వర్తిస్తాయి.

మరొకటి రియల్‌ మి 12ఎక్స్ 5జీ ఫోన్. ఇది ఫుల్-HD+ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. 45W SUPERVOOC ఛార్జ్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది.

డైమెన్సిటీ 6100+ 6nm 5G చిప్‌సెట్ అత్యాధునిక కనెక్టివిటీని అందిస్తుంది. ఫోటోగ్రఫీ ఔత్సాహికుల కోసం ఇందులో 50MP AI కెమెరాను అందించారు.

అమెజాన్‌లో రూ. 13,343 ధరతో ఇది అందుబాటులో ఉంది. ఇందులో బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

మరొక ఫోన్ రియల్ మి సి67 5జీ. ఈ ఫోన్ HD+ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల LCDని కలిగి ఉంటుంది. ఇది స్పష్టమైన, శక్తివంతమైన విజువల్స్‌ను అందిస్తుంది.

ఇది MediaTek డైమెన్సిటీ 6020 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. రోజువారీ పనులకు సున్నితమైన పనితీరును అందిస్తుంది.

50MP ప్రధాన సెన్సార్‌, 2MP డెప్త్ సెన్సార్‌‌ను కలిగి ఉంది. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.

అమెజాన్‌లో దీని ధర రూ. 12,960గా ఉంది. దీనిపై కూడా బ్యాంక్ ఆఫర్లు పొందొచ్చు.