చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మీ 13 ప్రో సిరీస్‌ను ప్రారంభించనుంది.

ఈ లైనప్‌లో రియల్‌మీ 13 ప్రో, రియల్‌మీ 13 ప్రో ప్లస్ 5జీ ఉన్నాయి.

ఈ ఫోన్లపై బ్యాంక్ ఆఫర్ ద్వారా రూ. 3,000 డిస్కౌంట్ పొందొచ్చు.

అలానే అదనంగా కస్టమర్‌లు 12 నెలల నో-కాస్ట్ EMIని ద్వారా దక్కించుకోవచ్చు.

 ఇందులో డ్యూయల్ 50MP Sony కెమెరా (Sony LYT-701 Sony LYT-600)తో వస్తుంది.

ఇది క్వాలిటీ ఫోటోల కోసం OIS, AI ఫీచర్లను అందిస్తుంది.

వీటిలో AI అల్ట్రా క్లారిటీ, AI స్మార్ట్ రిమూవల్, AI గ్రూప్ ఫోటో ఎన్‌హాన్స్‌మెంట్, AI ఆడియో జూమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇది మోనెట్ గోల్డ్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్‌లలో విడుదల కానుంది.

హ్యాండ్‌సెట్‌లో స్నాప్‌డ్రాగన్ చిప్, 80W ఛార్జింగ్‌తో 5,200mAh బ్యాటరీ ఉంటుంది.

DSLR కెమెరా క్వాలిటీతో కూడిన షాట్‌లను అందించడానికి గ్యాడ్జెట్లు AI ఎడిటింగ్ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది.