దానిమ్మ పండ్లలో శరీరానికి అవసరమైన పోషకాలను పుష్కలంగా ఉంటాయి.
దానిమ్మ గింజల్లో విటమిన్ బి, సి,కెతో పాటు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.
అంతే కాకుండా పొటాషియం, క్యాల్షియం వంటి పలు రకాల మినరల్స్ కూడా వీటిలో ఉంటాయి.
దృఢమైన పళ్ళు: దానిమ్మ గింజలు చిగుళ్ళను బలపర్చి, వదులుగా మారిన పళ్ళను గట్టిపరుస్తాయి.
జీర్ణశక్తి: వీటిలో బి కాంప్లెక్స్ విటమిన్లు జీర్ణ వ్యవస్థను మెరుగ్గా పనిచేసేలా చేస్తాయి.
శరీరంలోని కొవ్వులు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లను శక్తిగా మార్చటానికి దానిమ్మ దోహదం చేస్తుంది.
బరువు తగ్గడం: బరువు తగ్గాలనుకునే వారికి దానిమ్మ గింజలు ఎంతగానో సహాయపడతాయి.
దానిమ్మలో ఉండే పీచుపదార్థం చాలా సేపు వరకు కడుపు నిండుగా వున్న ఫీలింగ్ కలిగిస్తుంది.
దానిమ్మ గింజలు స్థూలకాయాన్ని కూడా నివారించి, కొవ్వును కరిగించటంలో సాయపడతాయి.
రోగనిరోధక వ్యవస్థ: దానిమ్మ గింజలలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి.
ఈ గింజలలోని కొన్ని ప్రత్యేక లక్షణాలు మీ రోగనిరోధక వ్యవస్థను బలహీనపర్చే బ్యాక్టీరియా, వైరస్లతో అద్భుతంగా పోరాడతాయి.