ప్రముఖ టెక్ బ్రాండ్ ఒప్పో తన లైనప్‌లో ఉన్న Oppo K12x 5G స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా కొత్త కలర్‌లో తీసుకొచ్చింది.

కంపెనీ దీనిని కొత్త పింక్ కలర్ ఆప్షన్‌లలో తాజాగా లాంచ్ చేసింది. దీనిని ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన ఆఫర్లతో కొనుక్కోవచ్చు. 

ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ 2024 సేల్‌లో Oppo K12x 5G పింక్ కలర్ వేరియంట్‌ను కొనుక్కోవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్ పింక్ కలర్ ఆప్షన్ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.12,999కి లాంచ్ అయింది.

ఈ ఫోన్‌ను సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 6 వరకు జరుగుతున్న బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో రూ.10,999కి సొంతం చేసుకోవచ్చు.

ఈ ఫోన్ రెండు నెలల క్రితమే లాంచ్ అయింది. అప్పుడు ఈ ఫోన్ బ్రీజ్ బ్లూ, మిడ్‌నైట్ వైలెట్ షేడ్స్‌లో లాంచ్ చేయబడింది.

అయితే ఇప్పుడు అందులో కొత్త పింక్ కలర్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇది 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది.

ఇందులో MediaTek డైమెన్షన్ 6300 ప్రాసెసర్ అందించబడింది. ఈ ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 14లో నడుస్తుంది.

ఇందులో 32MP వెనుక కెమెరా, 2MP పోర్ట్రెయిట్ సెన్సార్ కూడా ఉంది. ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు.