వచ్చే వారం విడుదలవుతున్న ప్రధానమైన స్మార్ట్‌ఫోన్లలో Galaxy Z Fold 6 ఒకటి.

ఈ ఫోల్డబుల్ ఫోన్ జూలై 10న లాంచ్ కానుంది. ఇది 7.6-అంగుళాల 120Hz మెయిన్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

6.3-అంగుళాల 120Hz కవర్ స్క్రీన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్ శక్తినిస్తుంది.

దీంతోపాటు Galaxy Z Flip 6 జూలై 10న అన్‌ప్యాక్ చేయబడిన Galaxy Z Fold 6తో లాంచ్ అవుతుంది.

ఇది 6.6 అంగుళాల 120Hz ప్రధాన డిస్‌ప్లే, 3.4 అంగుళాల 120Hz కవర్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది.

4000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది 50MP డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌ని కలిగి ఉండే అవకాశం ఉంది.

అలాగే జూలై 10న మోటోరోల కంపెనీ Motorola G85 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తుంది. ఇది 6.67-అంగుళాల 120Hz p-OLED డిస్ప్లే‌తో వస్తుంది.

ఇది 33W ఫస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది. దీని ధర సుమారు రూ.20,000 ఉండవచ్చని అంచనా.

Reno 12 5G సిరీస్‌లో Reno 12 5G, Reno 12 Pro 5G వంటి మోడల్స్ లాంచ్ అవుతున్నాయి.

ఈ రెండూ 120Hz రిఫ్రెష్ రేట్‌తో పెద్ద AMOLED స్క్రీన్‌లను కలిగి ఉంటాయి. డైమెన్సిటీ 7300-ఎనర్జీ SoC ద్వారా శక్తిని పొందుతుంది.

ప్రో మోడల్‌లో OISతో సోనీ LYT-600 ప్రధాన లెన్స్‌ను కలిగి ఉంటుంది. రెండింటిలోనూ సూపర్ VOOC ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది.