టెక్ బ్రాండ్ ఒప్పో తన లైనప్‌లో Oppo Reno 12 5G సిరీస్‌ను భారతదేశంలో జూలై 12న లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది

ఈ సిరీస్ నుంచి ఒప్పో రెనో 12 5జీ, ఒప్పో రెనో 12 ప్రో 5జీ వంటి మోడల్స్ మార్కెట్‌లో దర్శనమివ్వనున్నాయి.

Oppo Reno 12 5G స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 256GB స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

Oppo Reno 12 Pro 5G స్మార్ట్‌ఫోన్ 12GB RAM + 256GB స్టోరేజ్.. 12GB RAM + 512GB స్టోరేజ్ ఆప్షన్లలో అందించబడుతుందని సమాచారం.

ఈ రెండు చైనీస్ వేరియంట్‌లు వరుసగా MediaTek డైమెన్సిటీ 8250 స్టార్ స్పీడ్ ఎడిషన్ SoC, డైమెన్సిటీ 9200+ స్టార్ స్పీడ్ ఎడిషన్ చిప్‌సెట్‌ల ద్వారా శక్తిని పొందుతాయి.

అదే గ్లోబల్ వేరియంట్‌లలో MediaTek డైమెన్సిటీ 7300-ఎనర్జీ SoCలు  అందుబాటులో ఉన్నాయి.

వీటిలో రెండు 50-మెగాపిక్సెల్ కెమెరాలు, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి.

అంతేకాకుండా ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలోనూ 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి.

ఇవి 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి.

చైనా వెలుపల గ్లోబల్ మార్కెట్‌లో 12GB + 256GB వేరియంట్ బేస్ మోడల్ ధర EUR 499.99 (సుమారు రూ. 44,700)గా ఉంది.

మరోవైపు ప్రో మోడల్ 12GB RAM + 512GB వేరియంట్ EUR 599.99 (సుమారు రూ. 53,700)గా కంపెనీ నిర్ణయించింది.