హీరోయిన్లు అంటే కేవలం గ్లామర్ షో చేయడం కోసమే కాదు.. కొన్నిసార్లు హీరోలకు ధీటుగా యాక్షన్ కూడా చేయగలరు. ఇప్పుడు ఆ లిస్ట్‌లో నభా కూడా యాడ్ అయ్యింది.

తాజాగా నభా నటేశ్.. ఒక యాక్షన్ స్టంట్ చేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో తన స్టంట్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

నభా నటేశ్ చేతిలో ప్రస్తుతం రెండు ప్యాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. వాటికోసమే ఈ ప్రిపరేషన్ అని ఫాలోవర్స్ అనుకుంటున్నారు.

ప్రస్తుతం తను నిఖిల్ హీరోగా నటిస్తున్న ‘స్వయంభు’లో హీరోయిన్‌గా నటిస్తోంది నభా. దాంతో పాటు ‘నాగబంధనం’లో కూడా తనే హీరోయిన్.

2021లో ‘మాస్ట్రో’లో నటించిన తర్వాత మూడేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది నభా నటేశ్.

ఇటీవల ప్రియదర్శి హీరోగా నటించిన ‘డార్లింగ్’తో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. అప్పటినుండి సోషల్ మీడియాలో కూడా కొంచెం యాక్టివ్ అయ్యింది.

‘ఇస్మార్ట్ శంకర్’తో టాలీవుడ్‌లో ఎనలేని పాపులారిటీ సంపాదించుకుంది నభా నటేశ్. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులతో డీలా పడింది.

స్టార్ హీరోలతో నటించినా, యంగ్ హీరోలతో నటించినా నభా నటేశ్‌కు మాత్రం సూపర్ హిట్ దక్కలేదు.

కమ్ బ్యాక్ తర్వాత సినిమాల్లో మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అవ్వాలని డిసైడ్ అయ్యింది నభా.

‘డార్లింగ్’ సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వడానికి సిద్ధమయినా అందులో నభా నటేశ్ యాక్టింగ్‌కు ప్రశంసలకంటే నెగిటివ్ కామెంట్సే ఎక్కువగా వచ్చాయి.