బత్తాయి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

సీజనల్ ఫ్రూట్ అయిన  బత్తాయి తింటే అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

బత్తాయి పండులాగానే కాకుండా జ్యూస్ చేసుకుని కూడా త్రాగవచ్చు.

బత్తాయిలో విటమిన్ సి, ఎ, ఫాస్పరస్, ఫోలేట్ తో పాటు పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి.

బత్తాయి జ్యూస్ తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి  పెరుగుతుంది.

శరీర అవయవాల పని తీరు మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుంది.

శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే డిటాక్సీక్ ఏజెంట్‌గా పనిచేస్తుంది.

బత్తాయిలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

కండరాలు పట్టేయడం తిమ్మిర్ల బారిన పడకుండా ఉండడానికి బత్తాయి జ్యూస్ ఉపయోగపడుతుంది.

యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఫంగల్ లక్షణాలు బత్తాయి జ్యూస్‌లో ఉంటాయి.